Blog

  • గజల్

    Ms.Tasawar Khanum- a pakistani singer-  sang this in 1974.

    In 2005, this ghazal was used in hindi movie Zeher.

    अगर तुम मिल जाओ ज़माना छोड़ देंगे हम

    तुम्हें पा कर ज़माने भर से रिश्ता तोड़ देंगे हम

    तुम्हें दिल में रखेंगे अपनी पलकों में छुपा लेंगें

    तुम्हें खुशबू समझ के अपनी सांसों में बसा लेंगे

    कयामत तक जो ना टूटे वो रिश्ता जोड़ देंगे हम

    बदन के साये, जान-ए-मन, तुम्हारे रंग में रंग डाले

    जुदा क्या कर सकेंगे तुमको मुझसे ये जहांवाले

    मोहब्बत की कसम तक़दीर का रुख मोड़ देंगे हम

    ना तो तुम जिसमे शामिल वो बहारें हम नहीं लेंगे

    तुम्हारी नाम पे ये दिल तो क्या है जान भी देंगे

    नज़र जिसमें न तुम आये वो शीशा तोड़ सनेगे हम

    अगर तुम मिल जाओ ज़माना छोड़ देंगे हम

    अगर तुम मिल जाओ

    Lyrics:: Tasleem Fazli

    Singer: Tasawar Khanum 1974

    ANALYSIS:

    Central Theme

    The ghazal explores complete devotion and surrender in love – the lover is willing to abandon the entire world for their beloved. The intensity escalates through each couplet, expressing love that transcends worldly limitations.

    Couplet-by-Couplet Analysis

    Couplet 1 (Matla):

    “If you unite with me, we’ll abandon the world / Having found you, we’ll sever ties with everyone”

    Sets the tone of absolute choice – love versus world. The lover declares readiness for total isolation.

    Couplet 2:

    “We’ll keep you in our heart, hide you in our eyelids / We’ll consider you fragrance and settle you in our breath / We’ll forge a bond that won’t break till Doomsday”

    Beautiful sensory imagery – the beloved becomes part of the lover’s very being (breath, sight). The progression from heart → eyelids → breath shows increasing intimacy. “Qayamat tak” (till doomsday) introduces eternal commitment.

    Couplet 3:

    “Shadow of body, life of soul, dyed in your color / How can these worldly people separate you from me / By love’s oath, we’ll change fate’s direction”

    The lover claims unity so complete that separation is impossible. The bold declaration of “changing fate” shows love as a force that defies destiny itself. “जान-ए-मन” (life of my soul) is a classic Persian/Urdu term of endearment.

    Couplet 4:

    “We won’t accept springs in which you’re not included / For your name, forget heart, we’ll give our life / We’ll break every mirror in which you don’t appear”

    The most dramatic declarations – rejecting beauty (spring) without the beloved, offering life itself, and destroying any reality that doesn’t contain them. The mirror metaphor is particularly striking – refusing to see a world without the beloved.

    Tone and Style

    The tone is passionate, defiant, and romantic with a touch of sufistic devotion. The language blends Hindustani with Persian/Urdu vocabulary (“जान-ए-मन,” “कयामत,” “तक़दीर”), giving it classical ghazal flavor while remaining accessible. The conversational “हम” (we) makes it intimate yet somewhat formal.

    Overall Assessment

    A deeply romantic modern ghazal that successfully uses traditional forms and metaphors while maintaining emotional authenticity. Its strength lies in escalating intensity and vivid imagery that makes abstract devotion tangible.

    (Collated from different sources)

  • హిందీ పాటలు -లిరిక్స్

    అతివ వర్ణన పాటల సిరీస్ లో రెండో పాట :

    अब क्या मिसाल दूँ मैं तुम्हारे शबाब की

    ఆరతి సినిమా లోనిది.

    రఫీ గాత్రం /మజ్రూహ్ రచన /రోషన్ సంగీతం.

    अब क्या मिसाल दूँ, मैं तुम्हारे शबाब की
    इन्सान बन गई है किरण माहताब की

    चेहरे में घुल गया है हसीं चाँदनी का नूर
    आँखों में है चमन की जवाँ रात का सुरूर
    गर्दन है एक झुकी हुई डाली गुलाब की

    अब क्या मिसाल दूँ, मैं तुम्हारे शबाब की

    गेसू खुले तो शाम के दिल से धुआँ उट्ठे
    छू ले कदम तो झुक के न फिर आसमान उट्ठे
    सौ बार झिलमिलाए शमा आफताब की
    अब क्या मिसाल दूँ, मैं तुम्हारे शबाब की

    दीवार-ओ-दर का रंग ये आँचल ये पैरहन
    घर का मेरा चिराग है, बूटा सा ये बदन
    तस्वीर हो तुम ही मेरे जहान के ख्वाब की
    अब क्या मिसाल दूँ, मैं तुम्हारे शबाब की

    अब क्या मिसाल दूँ, मैं तुम्हारे शबाब की
    इन्सान बन गई है किरण माहताब की

    ===

    ప్రేయసి ని వర్ణించే పాటల్లో ఇదో మణిహారం.

    अब क्या मिसाल दूँ मैं तुम्हारे शबाब की:

    నీ రూపాన్ని దేనితో నైనా ఎలా పోల్చాలి – అనే rhetorical పాయింట్ తో పాట మొదలు.

    इन्सान बन गई है किरण माहताब की

    నీ అందంలో చంద్రకాంతి మానవ రూపం ధరించింది ( maahtab – splendour of moon)

    ఒక కవిప్రశ్న—అందం వర్ణనకు మాటలు తక్కువైపోయాయనే తలంపు.

    चेहरे में घुल गया है हसीं चाँदनी का नूर

    నీ ముఖం లో చంద్రకాంతి కరిగిపోయింది.
    आँखों में है चमन की जवाँ रात का सुरूर

    నీ నయనాల్లో తోటలో రాత్రి వికసించిన పూబాలల సౌరభవం

    गर्दन है एक झुकी हुई डाली गुलाब की

    నీ కంఠము గులాబీ కొమ్మలా సుతారం

    अब क्या मिसाल दूँ, मैं तुम्हारे शबाब की

    నీ రూపాన్ని దేనితో నైనా ఎలా పోల్చాలి ?

    गेसू खुले तो शाम के दिल से धुआँ उट्ठे
    నీ కురులు ముసిరిన చీకట్ల హృదయాంతరాళ్ల లో కెగసిన ధూమం

    छू ले कदम तो झुक के न फिर आसमान उट्ठे

    నీ పాదాన్ని తాకటానికి వంగిన ఆకాశం అక్కడే ఉండి పోతుంది.
    सौ बार झिलमिलाए शमा आफताब की

    నీ అందం ముందు పిండి వెన్నెల కొట్టు మిట్టాడుతుంది
    अब क्या मिसाल दूँ, मैं तुम्हारे शबाब की

    నీ రూపాన్ని దేనితో నైనా ఎలా పోల్చాలి?

    दीवार-ओ-दर का रंग ये आँचल ये पैरहन

    నీ ఆహార్యం నా గృహాన్ని జీవం తో నింపింది.
    घर का मेरा चिराग है, बूटा सा ये बदन

    నీ రూపురేఖలే నా ఇంటి దీపాలు
    तस्वीर हो तुम ही मेरे जन्नत के ख्वाब की

    నా కలలలో దాగిన స్వర్గధామపు శిల్పానివి
    अब क्या मिसाल दूँ, मैं तुम्हारे शबाब की

    నీ రూపాన్ని దేనితో నైనా ఎలా పోల్చాలి?

    (ఈ పాట లోని కొన్ని పదాలకు నాకు సరైన అర్ధాలు తెలుగు లో స్పురించలేదు. )

    ఈ పాట లో :

    • అసమాన సౌందర్యం (షబాబ్): యవ్వనపు వెలుగులు
    • ప్రకృతి, వెలుగు ప్రతీకలు : చంద్రుడు, సూర్యుడు, పువ్వులు వంటి ప్రతీకల ద్వారా పవిత్రత, ప్రకాశం.
    • అతిశయోక్తి: ప్రేమలో అతిశయాలు (ఆకాశం వంగిపోవడం మొదలైనవి).

    ఇకపోతే,

    ఈ గీతం ఘజల్ సంప్రదాయాన్ని తలపిస్తూ, ఉర్దూ కవిత్వం లో ప్రకృతి ప్రతీకలైన , చంద్రకాంతి, తారలు, గులాబి కొమ్మలు, రాత్రి సోయగం—అన్నీ కలగలిపి, ఒక సౌందర్యగీతం అయింది .

    ఆరాధన, స్త్రీ దివ్యత్వం అన్న అంశాలను మహమ్మద్ రఫీ గాత్రం కడు రమ్యం గా ఆలపింపగా ,రోషన్ సంగీతం దానికి ప్రాణం పోసింది.

    ఇది కేవలం ఒక ప్రేమగీతం కాదు—అందాన్ని మాటల్లో చెప్పలేని స్థితి, ప్రేమలోని ఆరాధన, స్త్రీ సౌందర్యానికి దైవత్వం ఆపాదించి కీర్తించే గీతం.

    ✨ఇలా, “అబ్ క్యా మిసాల్ దూం” ఒక శాశ్వత ఆరాధనగీతంగా నిలిచిపోయింది.

    (collated from different sources)

    1
  • కథాకదనం / Story Contest

    కథాకదనం / Story Contest


    #పలుకు.ఇన్ నిర్వాహక బృందం నుండి మిత్రులందరికీ శుభాకాంక్షలు.

    ప్రముఖంగా తెలుగు ఔత్సాహిక రచయితలను ప్రోత్సహించి, తెలుగు పాఠకులకు ఆసక్తికరమైన రచనలను అందించాలన్న ఆలోచనే, పలుకు.ఇన్.
    ఆగస్టు 9న మీ ముందు ముస్తాబై నిలచిన ఈ వేదిక, మీ అందరి ఆదరణతో వినాయక చవితి పండగ చేసుకుంది. నేటికి 40మందికి పైగా సభ్యులను చేర్చుకుంది. తోటి తెలుగు భాషా ప్రేమికులుగా మీ అందరినీ, మీలోని రచయితని మన తెలుగు ప్రపంచానికి పరిచయం చేయమని ఆహ్వానిస్తోంది.

    ఈ సందర్భంగా, ఈ దసరా పండగ వేడుకగా ఒక కథల పోటీ నిర్వహించబోతున్నాం. సెప్టంబర్ 19 మొదలు, అక్టోబరు 7 వరకు మీరు మీ కథలను మాకు పంపవచ్చు.
    ఈ పోటీలో 16సం.లోపు వారు ఒక వర్గంగాను, 16సం. – అంతకు పైబడిన వారు మరొక వర్గంగాను విభజింపబడతారు.
    ప్రతి వర్గం నుండి, ఎంపిక చేయబడిన మూడు కథలకు దీపావళి అనంతరం మా తరఫున బహుమానం అందచేయబడుతుంది.

    పోటీ తాలూకు పూర్తి వివరాలు, మీ కోసం:

    1. సెప్టంబర్ 19 నుండి అక్టోబరు 7 వరకు, మీరు రాసిన ఒక కథ, పోటీ కోసం మాతో పంచుకోవచ్చు.
    2. పాల్గొనదలచిన వారు, పలుకు.ఇన్‌ లో సభ్యులై ఉండాలి. సభ్యత్వం ఈ లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చు – https://restore.paluku.in/register. సభ్యత్వం ఆమోదించిన అనంతరం పలుకు.ఇన్‌ లో మీ రచనను అప్‌లోడ్ చేయవచ్చు.
    3. పోటీకి పంపదలచిన కథను పోస్ట్ చేయటానికి తప్పనిసరిగా “#కథాకదనం” అనే హాష్‌టాగ్ కథాశీర్షిక / టైటిల్ లో వాడవలసి ఉంటుంది. అలాగే, కథాకదనం / Story Contest కాటగరీలోనే పోస్ట్ చేయవలసి ఉంటుంది.
    4. పోటీ రెండు వర్గాలుగా విభజింపబడుతుంది. 16సం. వయసు లోపు పిల్లల కోసం ఒక వర్గం. 16సం. నుండి వయో పరిమితి లేకుండా మరొక వర్గం.
    5. మీ 16 సం. లోపు పిల్లల కథలను మీ అకౌంటు ద్వార పంచుకోండి, పోస్టు క్రింద పిల్లల పేరు, చదువుతున్న క్లాసు పంచుకోండి.
    6. రచయితలు తమ స్వీయ రచన ఏదైనా (కథ) ఒక ఎంట్రీ మాత్రమే పంపగలరు. ఒకటికంటే ఎక్కువ రచనలు తిరస్కరించబడతాయి.
    7. మీరు రాసిన కథ నిడివి ప్రతి పేజీ/పుటకి 200-250 పదాలు చప్పున కనీసం 1000 పదాలు (4 pages) నుంచి మొత్తం మీద 2000 పదాలు  మించకుండా ఉండే విధంగా చూసుకోండి. 16 సం. లోపు పిల్లలకి కథ నడివి 500 పదాల నుంచి 1000-1200 పదాల వరకు ఉండేలా ప్రచురించండి.
    8. కథావస్తువు, కథనం పట్ల ఎంపిక మీదే. అయితే, అశ్లీలత, అభ్యంతరకరమైన భాష, రాజకీయ, సినీ మరే ఇతరుల గురించిన వ్యక్తిగత విమర్శలు, అసంగత ప్రస్తావనలు నిషేధం అని గమనించండి.
    9. పోటీకి పంపబడిన కథలలో, ప్రతి వర్గం నుండి, నిర్ణేతలు మెచ్చిన మూడు కథలకు బహుమతి అందచేస్తాము.
    10. ఈ పోటీకి సంబంధించినంత వరకూ, బహుమతికి అర్హతలున్న కథల ఎంపిక, బహుమతి వితరణాధికారం పూర్తిగా మా పలుకు.ఇన్ నిర్వాహకులది, నిర్ణేతలది మాత్రమే. ఈ విషయం పట్ల ఎటువంటి ప్రశ్నలు, విమర్శలు అంగీకరింపబడవు.
    11. రచయితలు పోటీతో సంబంధం లేని తమ ఇతర రచనలను కూడా ఎప్పటిలాగే పలుకు.ఇన్ బ్లాగ్ పేజి‌లో పంచుకోవచ్చు.

    ఈ పోటీ ప్రకటన మీ మీ సమూహాలతో కూడా పంచుకోగలరని మా విన్నపం.

    అభినందనలతో,
    సంపాదకులు
    పలుకు.ఇన్

    5
  • ఇన్‌సైడ్‌మల్లి

    ఇన్‌సైడ్‌మల్లి

    ఈ తరం రచయిత వి.మల్లికార్జున్‌తో కాసేపు…  

    ఊరు నల్లగొండ. పేరు మల్లికార్జున్. ట్విట్టర్ అవతారం (X account) @insidemalli.
    చదువు పూర్తయిందన్న నాటికి ఇంజినీరుగా డిగ్రీ చేతిలో. రాయాలని దాచుకున్న కథలెన్నో మనసులో. ఉద్యోగం కొంత కాలం “సాక్షి,” “వెలుగు”పత్రికలలో. ఎలాగూ కలం చేతిలో. ఇక చుట్టూ చూసిన, చూస్తున్న లోకం, రెక్కలు కట్టుకు ఎగిరే తన ఊహాలోకం… రచయితగా సాకారం! 

    ఇరానీ కేఫ్, కాగితం పడవలు, నల్లగొండ కథలు.. రచయిత మల్లికార్జున్ కథలు ఎంత పాప్యులర్ అయినాయంటే, ఎంతగా చదువరుల ఆదరణ పొందాయంటే, కాగితం పడవలు అచ్చై, అమెజాన్‌లో అందుబాటులో ఉందన్న రోజే, “అన్నా పీడీఎఫ్ ఉంటే పంపుతావా?” అని వాట్సాప్ సందేశాలు అందుకునేంత! 

    తన కథలు పుస్తకంగా ముద్రించుకోవటానికి, తనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకుని, తన పాఠకులను నేరుగా చేరాలనే ప్రయత్నంగా “అజు పబ్లికేషన్స్” ప్రచురణ సంస్ఠ స్థాపించి, తనతో పాటు మరెందరో కథకులను కూడా తెలుగు సాహితీ లోకానికి పరిచయం చేసాడు. ఈరోజు వారంతా మనకు సుపరిచితులవటానికి తను ఊతమయాడు.  

    ఇందులో మాకు తెలీని విషయాలేమున్నాయనీ… నీకెంత దగ్గరో, మాకూ అంత సన్నిహితుడేగా అని విసుగుపడేవు.. అందుకే, ‘నీకు నా ప్రేమ,’ అనే వాక్యంతో మనందరికీ దగ్గరై, అందరినుండీ అంతులేని అభిమానం అందుకున్న మన నేస్తంతో కాసేపు.

    ఐతే ఇందులో ఓ చిన్న తిరకాసుంది. వీడు చెప్పేవన్నీ ‘ఔను కథలే…’నో, ‘ఔను కదా!’లో, మనకెలా తెలుస్తుంది?! అందుకే మేం కూడా గెలివిగా పలుకు.ఇన్ టీమ్‌నుండి ఓ కథా రాకాషి.ని బర్లోకి దింపాం! గిచ్చు, గిల్లు, నడ్డిమీన్నాలుగు ఛంపెయ్యూ.. నీక్కొత్తగా నేరిపీక్ఖల్లా కదా. నాలుగు ప్రెశెన్లూ, వాటికి నాలుగింతలు జవాబులూనూ తే, ఫో…, గో గల్ల్ డూ యిట్టని తోలాం!

    పక్క పేజీలో మల్లితో ముచ్చట. 
    మనందరి తరఫున మాధురి. మన కోసం,  తనవైపునుండి మల్లి.
    చదవండి. ఈ ఇంటర్వ్యూ గురించి మీ స్పందన తెలియచేయండి. మీకూ ఏమైనా ప్రశ్నలున్నాయా? అడగండి.

    అభినందనలతో,

    సంపాదకులు
    పలుకు.ఇన్

    1
  • మల్లితో ముచ్చట

    మల్లితో ముచ్చట

    రచనా ప్రక్రియ అనేది ప్రయత్న పూర్వకంగా అలవడుతుందా? సహజసిద్ధమైన లక్షణమా? అది ఎవరికైనా సాధ్యమేనా? Can you consciously decide and become a story-teller?

    రచనను ఒక క్రాఫ్ట్‌గా చూసుకుంటే, ఆ క్రాఫ్ట్ నేర్చుకుంటే వస్తుందా అంటే కచ్చితంగా వస్తుంది. నిజానికి రచయితలనేవాళ్ళంతా ఈ క్రాఫ్ట్‌ని సాధన చెయ్యాల్సిందే. అలాగని క్రాఫ్ట్ నేర్చుకోవడం ద్వారానే కథలు రాయగలమా అంటే రాయలేమనే చెప్తాను. ‘ఇది సహజసిద్ధంగా వచ్చే లక్షణం, రక్తంలో ఉంటుంది.’ ఇలాంటి మాటలు నేను మాట్లాడను. స్వభావరీత్య మనలో సమాజాన్ని దగ్గరగా చూసి మనుషుల్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకునే లక్షణం ఏదో ఉండాలని అనుకుంటాను. ఎంపతీ, హానెస్టీ కథలు చెప్పడానికి కచ్చితంగా ఉండాలి. ఇది నేర్చుకుంటే వచ్చేదా అనేకంటే ఇదే ఒక వే ఆఫ్ లైఫ్ కావాలి.  

    రచయిత తన చుట్టూ నిర్మించుకునే ప్రపంచంలో, పాఠకుడికి ముందునుండీ ఒక స్థానం ఉంటుందా? అంటే, చదువరుల స్థితి, స్థాయిలనుసరించి రచన సాగుతుందా? లేక, కథ తనను తాను మలచుకొని, తనదైన రూపంలో మాత్రమే పాఠకుడిని చేరుతుందా?

    రచయితలందరి తరపున చెప్పలేను గానీ, నాకైతే రాయడమనేది చాలా పర్సనల్. ఏదైనా రాసేటప్పుడు, ఇది చదివేవాళ్ళు ఎలా తీసుకుంటారని ఒక్కసారైనా ఆలోచించను. ఒక పాఠకుడ్ని ఊహించుకొనైతే నేను కథ రాయలేను. 

    రచయిత దృష్టి పెట్టాల్సింది తన మనసులో మెదిలే కథాంశం, తన భావోద్వేగాల పైననా? లేక ఆ రచనతో తను చేరదలచిన పాఠకుల ఒప్పుదల పైనా?  

    కచ్చితంగా కథాంశం, తన భావోద్వేగాలపైనే అనుకుంటాను. పాఠకులు ఏమనుకుంటారని ఏదైనా రాస్తే, మనకు మనమే ఆ రచనకు మెల్లమెల్లగా దూరమవుతామేమో. అయితే జాన్రా ఫిక్షన్‌లో రచయితకు పాఠకుడి ఒప్పుదలతో అవసరం ఉంటుందనుకుంటాను. 

    సమకాలీన కథావస్తువు అధికతమంగా ఏ విషయపరంగా ఉంటున్నది? కథావస్తువుల ఎంపికలో వైవిధ్యం ఏ మేరకు కనపడుతున్నది? ఏ విషయం పట్ల అలక్ష్యం చూపుతున్నారు?

    తెలుగు సాహిత్యమనే కాదు, ఎక్కడైనా కొన్నాళ్ళపాటు ఒక ట్రెండ్ ఉంటుందేమో. నేను చదవడం మొదలుపెట్టిన రోజుల్లో అస్తిత్వ ఉద్యమాల ప్రభావం వల్లనేమో ఆ రచనలు ఎక్కువగా కనిపించేవి. గత కొన్నాళ్ళుగా ప్రేమకథలు చాలా చెప్తున్నారు. నేటి తరం ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణలను కథల్లోకి తీసుకురావడం కూడా ఉంది. అలక్ష్యం చేస్తున్నారని చెప్పను గానీ, స్త్రీ పురుష సంబంధాల్లోని కాంప్లెక్సిటినీ చూపించడం తక్కువ ఉందనిపిస్తోంది. 

    ఈనాటికి కూడా వివిధ రచనా ప్రక్రియలకు పాఠకలోకంలో ఆదరణ వుందా? నవలలు, నాటికలు, గేయ రూపక కథా రచనలను చదువరులు స్వాగతిస్తారా?

    నవలలు, కథలు ఇప్పటికీ బాగా చదువుతున్నారు. కవిత్వానికి కూడా ఆదరణ ఉంది. నాటికలు, గేయ రచనలకు పాఠకుల ఆదరణ పక్కనబెడితే రచయితలే అటువైపు చూడటం తగ్గిపోయింది కదా! సినిమాలకు పాటలు రాయడాన్ని పూర్తిస్థాయి కెరీర్‌గా తీసుకున్న కవులు కూడా ఉన్నారుగా. 

    ఎందువలన ఇటువంటి రచనా ప్రక్రియలు మరుగున పడుతున్నాయి? వీటి పట్ల రచయితలు ఎందుకు ఉదాశీనంగా ఉంటున్నారు?

    పైన చెప్పినట్టు కథలు, నవలలు చదవడంలో ఉన్న సౌకర్యం ఇతర ప్రక్రియల్లో లేకపోవడం వల్ల అనుకుంటాను. అలాగే సినిమాలకు దగ్గరైన తర్వాత పాఠకులే తగ్గిపోయిన చోట రచయితలైనా ఈ ప్రక్రియల పట్ల ఆసక్తి చూపించి ఏం చేస్తామనుకొని ఉండొచ్చు!

    మన సినిమాలు, నవలలు ఇంకా కూడా బాహాటంగానో, అంతర్లీనంగానో, మనకున్న పురాణ ఇతిహాస కథలను, జానపద గ్రామీణ ప్రాంతాల గాథలనూ ఆధారంగా చేసుకుంటాయి. వీటికెందుకింత ఆదరణ? సమకాలీన రచయితగా, ఒక పాఠకుడిగా వీటిని మీరెలా చూస్తారు?

    బహుశా పురాణ ఇతిహాస గాధలు మన జీవితాల్లో భాగమైపోవడం వల్లనేమో, మనం కథలు చెప్పే క్రమంలో ఆ శిల్పం వచ్చి చేరుతుందేమో. ఇంకొకటి ఎంతటి క్లిష్టమైన విషయాన్నైనా సులువుగా చెప్పే నేర్పు మనకు అక్కడ్నించి వచ్చిందనుకుంటాను. నేను రచయితగానైనా పాఠకుడిగానైనా కథ చెప్పడానికి అవసరమైనప్పుడు వీటిని వాడితే తప్పేమీ లేదనుకుంటాను. పురాణాలను మెటఫర్‌గా వాడి చెప్పే ఆల్టర్నేట్ కథల్ని చదవడానికి నేనంత ఇష్టపడను. 

    కవి/రచయిత సమాజం తన ఎదుట ఉంచుకున్న నిలువుటద్దమంటారు. ప్రస్తుత పరిస్థితులలో, ఇది నిజమేనా? 

    సమాజం దీన్ని నమ్ముతోందా? సినిమాలను సినిమాలుగా చూడండి అనే రోజుల్లో ఉన్నాం కదా. సాహిత్యానికైనా అలాంటి పరిస్థితే ఉందేమో. నేనైతే సమాజాన్ని కొంచెం దగ్గరగా చూసి అర్థం చేసుకొని చెప్పేవాడు రచయిత అనుకుంటాను. 

    ద్రష్ట/స్రష్టగా నిలబడటానికి రచయితకుండాల్సిన లక్షణాలేంటి? అతడిలో మనం చూడవలసిన నిబద్ధత ఏంటి? 

    నిజాయితీ, సహానుభూతి ఇవి ఒక రచయితకు తప్పకుండా ఉండాలనుకుంటాను. ఒక్కసారి బయటికొచ్చి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రేమించి చూడగలిగితే మనకెన్నో కథలూ ఎందరో మనుషులూ తారసపడుతుంటారు. అన్ని కథల్నీ రాయాల్సిన అవసరం కూడా లేదు. అలా బతికేస్తే ఎప్పుడో రాయాల్సిన కథలు రాయాల్సిన రోజు తప్పకుండా వస్తుంది.  

    రచయిత/కవి సమాజ స్థితిగతుల లోపాలను ప్రశ్నించి తీరాలా? ఆ విధమైన బాధ్యత వ్యక్తమైనదే ఉత్తమ రచన అనుకోవాలా?

    సమాజంలోని లోపాల్ని రచయిత కచ్చితంగా ఎత్తి చూపాలి. మనం ఏ వైపు నిలబడాలో తెలియకపోతే, అర్థం చేసుకోకపోతే మనం రాసే రచనలకు అర్థం ఏముంటుంది? అయితే అదే ఉత్తమ రచన అవుతుందని కూడా అనుకోవాల్సిన పని లేదు.  

    మీ ఆలోచనలో సామాజిక బాధ్యత అంటే ఏమిటి? మీ రచనలు ఆ బాధ్యతకు లోబడి, ఆ నిర్వచనానికి కట్టుబడి ఉంటాయా?

    పై సమాధానానికి కొనసాగింపుగానే చెప్తాను. సామాజిక బాధ్యత అందరు పౌరులకు ఎలా ఉండాలో, రచయితలకు ఇంకాస్త ఎక్కువే ఉండాలి. మన కథలు పనిగట్టుకొని ఒక సామాజిక సమస్యను చెప్పకున్నా, మనం కథ చెప్పే తీరులో పాత్రల్ని మలిచే తీరులో మనిషిగా ఈ రచయిత ఎక్కడున్నాడన్నది తెలిసిపోతుంది. అంటే నేనొక స్త్రీవాద కథ చెప్పాలని ఒక కథ రాయాల్సిన పనిలేదు. నేను స్వతహాగా స్త్రీవాదిని అవ్వడం వల్ల ఆ కథ చెప్పేటప్పుడు నేనెంత కట్టుబటి ఉంటానో అర్థమైపోతుంది. అలా చూసినప్పుడు ఈ బాధ్యత ఇన్నేట్‌గా మనలో ఉండే క్వాలిటీ అయ్యుండాలి, కథ రాయడానికే పుట్టుకొచ్చే ట్యాగ్ కాకూడదు. 

    ఈ సందర్భంలోనే, పలుకు.ఇన్ ద్వారా తమ రచన/పఠనాసక్తులను మెరుగు పరచుకోవాలనుకునే మిత్రులకు ప్రోత్సాహకరంగా, మీరు ప్రశ్నోత్తరాలు, కథా పరిచయం/విశ్లేషణ వంటి శీర్షిక ఏదైనా మీ అనుకూలత ప్రకారం నిర్వహించగలరా?

    తప్పకుండా! ఈ రోజుల్లో ఒక వెబ్ మ్యాగజైన్ నడపాలన్న ఆలోచన రావడమే పెద్ద విషయం.మీరు ఇంత ఇష్టంగా ఈ బాధ్యత తీసుకున్నారు. నన్నొక వర్క్‌షాప్ లాంటిది ఏదైనా నిర్వహించమంటే తప్పకుండా నిర్వహిస్తాను. 

    2
  • విలువలందు మౌలిక విలువలు వేరయా…

    మీరేంటో.. మీ విధానాలేంటో..

    “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో రావు రమేష్ అంటాడు గుర్తొచ్చుంటది మీకు. ఒక పద్ధతి, ఒక విజన్ అంటూ తన పక్కన కూర్చున్న వాళ్ళ వైపు చూపిస్తూ మహేష్ బాబుని ఎద్దేవా చేసి మాట్లాడతాడు. తను మాట్లాడుతుంది core values గురించి కావొచ్చు (అనగా మౌలిక విలువలు అనొచ్చోమో తెలుగులో). మీరెప్పుడైనా ఆలోచించారా, మీ core values ఏమిటి అని? మీకు “నచ్చే” values కాదు. ఉదాహరణకి మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి పట్ల ఆదరణ చూపించే గుణం వేరేవారిలో చూసినప్పుడు మీకు ముచ్చటేయొచ్చు, కానీ మీరు స్వతహాగా అలా ప్రవర్తించకపోవచ్చు. అది మీ మూల స్వభావం కాకపోవచ్చు.

    మీరు గమనించినా, గమనించక పోయినా మీ నడవడికని, మీ నిర్ణయాలని నిర్దేశించేవి మీ core values. మీ కుటుంబ నేపధ్యం, పెరిగిన పరిస్థితులు, ఎవరితో ఎక్కువ కలిసి తిరిగారో ఆ వ్యక్తుల ప్రభావం వీటన్నిటి మీద ఆధారపడి బలపడతాయి core values, కాలక్రమేణా అవి మార్పు చెందే అవకాశం కూడా ఉంది. మన నైజంలో మనకున్న మిగతా గుణాలకంటే dominating గా ఉండేవే Core values. మనిషి మనిషికీ మారుతూ ఉంటాయి. ఒక పార్టీ పట్ల లేదా తన కుటుంబం పట్ల loyalty అనేది Core value గా ఉన్న వాడు తన నేత లేదా కుటుంబ పెద్ద ఎన్ని తప్పులు చేసినా సమర్థించుకుంటూనే ఉంటాడు. అలా కాకుండా Fairness అనేది core value గా ఉన్నవాడు అలా సమర్ధించే ప్రయత్నం చేయడు. అలాగే Fidelity, అంటే జీవిత భాగస్వామి పట్ల faithful ఉండటం కొంతమందికి core value కాదు. దాన్ని dominate  చేసే value ఇంకేదో వాళ్ళలో ఉండొచ్చు (Hedonism?).

    మనకి అస్సలు నచ్చని రాజకీయ నాయకుడినో, సెలబ్రిటీనో అమితంగా ఆరాధించేవాళ్ళు మనకి సోషల్ మీడియాలో తారసపడినప్పుడు మనకి అనిపిస్తుంది..నాకు కనిపిస్తున్న, అర్థమౌతున్న విషయాలు వీరికి కనిపించటం లేదా, అర్ధం చేసుకోలేకపోతున్నారా అని. It’s just that their core values or what they value in a leader or a celeb are probably different from yours.

    సరే, మీరెప్పుడైనా మీ core values ఏమిటి అని ప్రశ్నించుకున్నారా? అవేంటో కనుగొనే ప్రయత్నం చేశారా? మీరు ఇంటర్నెట్ లో వెతికితే చాలా పద్ధతులు దొరుకుతాయి ఈ ప్రయత్నానికి. నేనొక సులభమైన పద్ధతి చెప్తాను. మూడే మూడు ప్రశ్నలు వేసుకోండి.

    1. సాధారణంగా మీకు ఇతరులలో నచ్చని గుణాలేంటి? ఆ గుణాలకి పూర్తివ్యతిరేకమైన గుణాలే మీ మౌలిక విలువల్లో ఉండొచ్చు. ఉదాహరణకి, పంక్చువాలిటీ అంటే సమయ పాలన.
    2. మీకూ మీ మిత్రులకీ మధ్య ఎక్కువగా కలిసే గుణాలేంటి? ఉదాహరణకి కుటుంబానికి ఎక్కువ విలువివ్వటం
    3. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సివచ్చినప్పుడు – కారు గానీ ఇల్లు గానీ కొన్నప్పుడు, లేదా చదువులో, కెరీర్లో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు ఏ లక్షణాలకి పెద్దపీటవేస్తారు – మీ హోదా పెంచేవిధంగా ఉండే వాటికా, సాధ్యమైనంత తక్కువలో ఐపోయే వాటికా, మీ కుటుంబసభ్యులకి ఎక్కువ నచ్చిన వాటికా?

    ఈ ప్రశ్నలగురించి తీక్షణంగా ఆలోచిస్తున్నపుడు మీకు అనిపించిన 3 నుంచి 5 దాకా గుణాలని లేదా విలువలని ఒక చోట వ్రాసిపెట్టుకుని, కొద్ది రోజుల పాటు మీ నడవడికతో మీరు తీసుకుంటున్న నిర్ణయాలతో బేరీజు వేసుకోండి.

    అసలిదంతా ఎందుకు? ఎందుకంటే మీ గురించి మీకు సరిగ్గా తెలిస్తే, మీరు ఇకనుంచి తీసుకునే నిర్ణయాలు మరీ ఎక్కువసేపు ఆలోచించకుండా తీసుకోవచ్చు, ఎందుకంటే ఆ నిర్ణయాలు మీ మౌలిక విలువలకు లోబడే ఉన్నాయని, ఆ తర్వాత చింతించరని మీకు నమ్మకమొచ్చింది కాబట్టి. అలాగే ఇతరుల ప్రవర్తన, వారి నిర్ణయాలు ఒకవేళ నచ్చకపోయినా వారి దృక్కోణం నుంచి చూసే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే వారి మౌలిక విలువలు ఆ నిర్ణయాలకి దోహదం చేసుండొచ్చని మీకు అర్ధమయింది కాబట్టి.

    2
  • Courage to Dream Beyond One’s Lifetime

    Courage to Dream Beyond One’s Lifetime

    This tweet recently provoked me to articulate thoughts that have been weighing on my mind. Despite being 1.4 billion people, we lack thought leaders. We aren’t yet a knowledge society where everyone understands the intricacies of economy, planning, and opportunities. While half the population struggles with daily survival, much of our youth is consumed with entertainment rather than creation, lacking ambitious goals. In our conservative society, dreaming big itself seems distant. So when someone of such eminent background, who served in public service and should inspire people to think big, makes such dismissive statements, it provoked me to respond.

    While I won’t delve into the intentions of the ex-officer who authored it, someone with a long career in public service whose qualifications, intellect, and capability I don’t question, I want to address the merits of his statement alone. I have expressed my critical reservations about civil servants before (https://x.com/hjasti/status/1896286754380140868), but this particular perspective demands a more nuanced response.

    What Is Vision?

    Vision is the ability to visualize something before it happens. It is a summary of objectives we aspire to achieve in the future, whether for personal life, organizations, communities led by powerful personalities, or even nation-states. It is a remarkable quality that anyone can cultivate, even if not possessed by default.

    Consider the countless cases of disabled individuals who visualize themselves running in the future. This vision helps them overcome their struggles. When the seed of vision is sown, it takes root in the mind and returns repeatedly to push us toward our goals. The subconscious mind is a wonderful and extraordinary faculty that drives us toward the vision we hold.

    While this applies to individuals, organizations can harness similar power when leadership teams create comprehensive plans with clear milestones and action items for their executive teams. The leadership enables executives to work collectively toward the organization’s vision.

    Historical Precedents of Transformational Vision

    Imagine Gandhi, Bose, or any freedom fighter holding a vision of independent India without knowing when, or if, they would ever see a free India. Martin Luther King Jr. wouldn’t have fought for civil rights without visualizing an equal society. Henry Ford’s vision propelled industrialization to unprecedented levels, envisioning a future that was incomprehensible to most of his contemporaries. We can quote many such examples like Nelson Mandela, Abraham Lincoln, Lee Kuan Yew etc. From recent times, Steve Jobs exemplified this visionary thinking, as does Elon Musk, who revolutionized space travel with reusable rockets and envisions humanity becoming a multi-planetary species.

    Vision vs. Wishful Thinking

    What distinguishes true vision from mere wishful thinking? A genuine vision transforms an ambitious dream into a framework grounded in reality. While vision provides a broad outline of objectives, it must be based on understanding present circumstances, learning from past experiences, and building capabilities we possess or plan to develop. The breadth allows for adaptation and evolution, but the foundation must remain solid. Without this grounding, even the grandest dreams remain fantasy.

    The Abuse and Misuse of “Visionary”

    Unfortunately, “visionary” has become one of the most abused terms in recent times, more so in political context. Many seek to appropriate this label for personal mileage. Some claim to have visions spanning 1,000 years, which borders on the ridiculous. A vision without an achievable timeline and defined action items is tantamount to blindness.

    It requires tremendous leadership effort to rally crowds toward a vision and transform it into a collective aspiration for society. The transformed Singapore, a dramatically improved Rwanda, or the European Union conceptualized in the 1950s serve as brilliant examples of following a visionary path.

    Complexity of Public Vision and Demographic Challenge

    When it comes to public life, vision for nation-states, cities, and communities, the challenge becomes infinitely more complex. What might succeed in small, contained environments may face enormous obstacles when applied to broader geographies and diverse communities. Success depends entirely on leadership’s ability to communicate and embed their vision among the people they serve.

    A leader’s vision will remain meaningless unless they can make it tangible for others. This requires either inspiring people to believe and participate, or demonstrating progress through clear roadmaps and achievable milestones. Without this translation from abstract dream to concrete reality, even brilliant visions become empty rhetoric.

    The challenge becomes more complex and less convincing when the population is large, as in populous states and countries where significant fragmentation prevents unified commitment to a shared path. In a vibrant democracy like ours, continuity becomes even more challenging since electoral defeats can disrupt leadership. This cycle can repeat, extending timelines far beyond original aspirations.

    Vision vs. Accountability

    However, vision provides a broad outline of objectives. Over many years, trends, developments, innovations, and other changes can accelerate progress or redirect it entirely. Holding someone accountable for their vision seems amateurish given the challenges in democratic setup – leaders should be judged on their efforts and progress toward the vision, not on whether they personally achieve every stated goal. Even more childish is expecting leaders to limit their dreams to what they can personally witness in their lifetimes.

    This represents a narrow mindset that one should only plan within their own lifespan. Great leaders, whether political or otherwise, don’t think solely about themselves or their limited time on earth. You may dismiss vision as fantasy or view visionaries as charlatans and hypocrites, but this reveals the limitations of your own perspective.

    The Necessity of Constructive Debate

    Debating a vision, its path, milestones, and timeline, is not only needed but essential. So-called visionaries and their credibility should absolutely be questioned. Their track records, where they exist, must be verified. These visions should be thoroughly discussed and critically analyzed. We don’t want another Adolf Hitler, whose contrived vision was detrimental and disastrous to the whole world. We should be highly vigilant against such dangerous visions.

    But ridiculing someone simply for having a vision reveals a distorted understanding of leadership and progress. It betrays a poverty of imagination and an inability to appreciate the courage required to dream beyond one’s own existence.

    Finally

    True leadership requires the audacity to envision transformation that may outlive the visionary. While we must rigorously examine these visions and hold leaders accountable for their efforts toward achieving them, we must not mistake the courage to dream big for mere fantasy. The difference between a charlatan and a true visionary lies not in the scope of their dreams, but in their commitment to laying the groundwork for future generations to build upon.

    We should encourage the courage to dream beyond one’s lifetime while maintaining the wisdom to distinguish between genuine vision and empty rhetoric.

    1
  • “వస్తానన్నాడు”

    “వస్తానన్నాడు”

    బాల్కనీలోని ఫ్రెంచ్ విండో దగ్గర నిలబడి, చీకటి కమ్మిన ఆకాశంలోకి దృష్టి సారించింది ప్రియ. నిశ్శబ్దం… గాలి కూడా కదలని నిశ్చలత. ఆకాశం మేఘాలతో కప్పబడి, చంద్రుడు, చుక్కలు కనిపించటం లేదు. వర్షం వస్తుందేమో అనిపించింది. కరెంటు పోయి, చుట్టూ చీకటి. గదిలోనూ అంధకారమే. ఇన్వర్టర్ పనిచేయక చాలా కాలమైంది. కొవ్వొత్తి వెలిగించాలన్న ఆలోచన కూడా రాలేదు. “వస్తానన్నాడు…” అనుకుంటూ లోపలికి వచ్చి, సోఫాలో కూర్చొని ఫోన్ తీసింది. కానీ, అది తనలాగే మౌనంగా, బ్లాంక్ స్క్రీన్‌తో నిశ్చలంగా ఉంది.

    మళ్లీ బాల్కనీ వైపు చూసింది. వర్షం మొదలైంది—మొదట చినుకులుగా, కొన్ని నిమిషాల్లోనే కుండపోతగా మారింది. ఫ్రెంచ్ విండో అద్దాలపై వర్షం గులకరాళ్లలా కొట్టుకుంటూ శబ్దం చేస్తోంది. అద్దాల గుండా ఏమీ కనిపించడం లేదు; వర్షపు ధారలు దృష్టిని కప్పేసాయి. ఉరుములూ, మెరుపులూ లేవు—కేవలం వర్షం యొక్క లయబద్ధమైన శబ్దం మాత్రమే.

    ఈ చీకటిలోనూ, గదిలోని ప్రతి వస్తువు ఎక్కడుందో ప్రియకు ఖచ్చితంగా తెలుసు. ఈ సింగిల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్‌లో ఆమె, అశోక్ గత ఐదేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన రోజుల్లో వీరిద్దరి పరిచయం జరిగి, ఇప్పటికి పదేళ్లు గడిచాయి. హాల్లో సోఫాకు ఎదురుగా టీవీ—అది కొనేటప్పుడు చిన్నది తీసుకుందామని ప్రియ అంటే, “పెద్దదే కావాలి, డీటెయిల్స్ బాగా కనిపిస్తాయి, గదిని చీకటి చేసి సినిమా చూస్తే నువ్వు కథలో లీనమైపోతావు తెలుసా” అని అశోక్ పట్టుబట్టాడు.

    అశోక్‌కి సినిమాలంటే పిచ్చి. కథలు చెప్పడమైనా, తెరపై చూడడమైనా—అతనికి అదో లోకం. సినిమా విషయంలో అతను హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ప్రతి వివరాన్నీ క్షుణ్ణంగా గమనిస్తాడు. కానీ ప్రియ అలా కాదు—సినిమా నచ్చకపోతే మధ్యలోనే ఆపేయమంటుంది. “వాళ్లు కష్టపడి తీశారు కదా, మనమే చూడకపోతే ఎలా. మన కులమే కదా వాళ్ళాడు కూడా” అనేవాడు అశోక్.

    ఇప్పుడు అతను ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. “షూటింగ్ కదా, షెడ్యూల్స్, ప్లానింగ్… తీరికే దొరకడం లేదు” అంటూ ఉంటాడు. సినిమా ప్రపంచంలోకి వెళితే అతను బయటి లోకాన్ని మరిచిపోతాడు. కానీ ప్రియకు షూటింగ్ ప్యాకప్ అయితే పని అయిపోయినట్టే. అయినా, ఈ మధ్య అశోక్ అతిగా పనిచేస్తున్నాడు.

    మళ్లీ బాల్కనీ వైపు చూసింది ప్రియ. వర్షపు చినుకులు లయబద్ధంగా కురుస్తూ ఇళయరాజా సంగీతంలా అనిపించాయి. చీకటిలో ఎవరో తనను గమనిస్తున్నట్టు ఒక భావన. ఆ ఆకారం తననే తీక్షణంగా చూస్తోందేమో అని వెన్నులో వణుకు మొదలైంది. కర్టెన్లు వేద్దామనుకుంది, కానీ అలాగే వదిలేసింది. ఆలోచన నెమ్మదిగా అశోక్ వైపు మళ్లింది.

    అశోక్ ఎంత సపోర్టివ్! ఇక్కడ పోటీ తట్టుకోలేక ఊరు వెళ్ళిపోతాను లేకపోతె ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను అంటే “నువ్వు చేయగలవు, ఇక్కడే ఉండి ప్రయత్నించు” అనేవాడు.  తాను ఉద్యోగం చెయ్యటం లేదు సినిమాల్లో పనిచేస్తున్నాను అని తెలిసి అమ్మానాన్న ఎన్ని మాటాలన్న నోరుమూసుకుని భరించమన్నాడు. “వాళ్లకి ఇండస్ట్రీలో చెడె కనిపిస్తుంది, మనం ఎదుగుతే మళ్ళి వాళ్ళే మనల్ని గర్వంగా చూస్తారు” అనేవాడు. తాను ఈరోజు ఇలా ఉండడానికి కారణం అశోకే, అతను లేకపోయి ఉంటె ఇలా కూడా ఉండడం కష్టమయ్యేది ఏమో.

    ఫ్రెంచ్ విండో తలుపు సరిగ్గా వెయ్యలేదేమో చిన్నగా గాలి వస్తుంది. సోఫాకి ఎదురుగా టీపాయ్ మీద ఉన్న కాగితాలు ఆ గాలికి రెపరెపలాడుతున్నాయి, వాటి పైన బరువేమి పెట్టలేదు గాలి కాస్త పెరిగేసరికి అవి ఎగిరాయి, తీయాలనుకుంది, కానీ “కరెంటు వచ్చాక చూద్దాం” అని వదిలేసింది. ఆ ఆకారం ఇంకా తననే చూస్తున్నట్టు అనిపించినా అటు తల తిప్పి చూడడానికి ధైర్యం సరిపోవడం లేదు.

    లోపల బెడ్రూమ్లో తాను పడుకుంటే ఇక్కడ హాళ్ళో సోఫాపై అశోక్ పడుకుంటాడు, అందుకే సోఫా వదిలి వెళ్లాలని ఉండదు. సోఫాలో కూర్చుంటే అశోక్ తో ఉన్నట్టు అనిపిస్తుంది ప్రియకి. వాళ్లిద్దరి సంబంధం స్నేహమని మొదట్లో జనాలకు చెప్పడానికి ప్రయత్నించారు, తర్వాత విరమించుకున్నారు. “జనాలకి ఏముంది ఏదో ఒకటి వాగుతారు” అంటాడు. ఇదే విషయం ప్రియ అమ్మానాన్నలకు కూడా చెప్పడానికి చాలా పర్యాయాలు ప్రయత్నించారు ఇద్దరు. “ఈ సినిమావాళ్లు ఇంతే, అంతా రంకే” అంటూ వారు ప్రియని పట్టించుకోవడం మానేశారు.

    సోఫా నుండి ఎడమవైపు బాల్కనీ – అక్కడినుండి  ఆ ఆకారం ఇంకా వెళ్లినట్టు లేదు తననే చూస్తుంది. కుడివైపు మెయిన్ డోర్. అటువైపే చూస్తూ  “ఎప్పుడో  వస్తానన్నాడు ఇంకా రాలేదేమిటి?” అనుకుంటుండగా తలుపు తెరిచిన శబ్దం.  బయటకు చూసింది —తడిసిన బట్టలతో అశోక్ వెనుక ఇంకో ఇద్దరు ముగ్గురు వచ్చారు. లోపలికి వస్తూనే ఎమర్జెన్సీ లైట్ వేసాడు, ఆ వచ్చిన వాళ్ళు ప్రియని కదిలించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఆమె కదలడం లేదు. “సాయంత్రం కీమో నుండి తెచ్చినప్పుడు బానే ఉండేది… అరగంట క్రితం రూంకి వచ్చి చూస్తే ఇలా…” అంటూ అశోక్ ఏడుస్తున్నాడు.

    బాల్కనీలో ఆ ఆకారం నెమ్మదిగా చీకటిలో కలిసిపోయింది. 

  • స్వదేశీ – ఆత్మనిర్భర్ లాంటి భావాలు దుర్వినియోగం కాకుండా ప్రజలు చేయాల్సిందేమిటి?

    గత వ్యాసంలో(https://restore.paluku.in/?p=1648) స్వదేశీ వస్తువులనే కొనాలని ప్రభుత్వం పిలుపివ్వటం ఎంత దివాళాకోరు ఆలోచనో, సామాన్య ప్రజలుగా మనకి స్వదేశీ ఎందుకు ఉపయోగకరం కాదో మాటాడుకున్నాం (నాణ్యత, ధర విషయంలో రాజీ పడాల్సివస్తుంది కాబట్టి). నాణ్యత విషయంలో ప్రధాన దోషి మన ప్రభుత్వాలే. వస్తునాణ్యతా ప్రమాణాలని సరిగ్గా నిర్దేశించటంలో, తయారీదారుల ఫాక్టరీల్లో తరచుగా తనిఖీలు నిర్వహించి నిస్పాక్షికంగా, నిర్దాక్షిణ్యంగా జరిమానాలు విధించటంలో, లైసెన్సులు రద్దు చేయటంలో ప్రభుత్వ అధికారుల అలసత్వం, అవినీతి గురించి మనకి తెలియంది కాదు. రెస్టారెంట్లలో ఆహార పదార్థాలే కావొచ్చు, మార్కెట్లో అమ్మబడుతున్న పన్నీరు, నూనెలు, డీజిల్, ఆఖరికి ప్రాణాలు నిలబెట్టాల్సిన మందుల్లో కూడా కల్తీనే (లేదా నాసిరకం ప్రమాణాలే). ఇలా చేసే వ్యాపారసంస్థల్లో ఎక్కువ ఉండేది స్వదేశీనా, విదేశీనా అనే విషయం మీ ఊహకే వదిలేస్తున్నాను.

    ఇక ఆత్మనిర్భర్ విషయానికొస్తే నేను చెప్పేది గుండె నిబ్బరం చేసుకుని వినండి. ఏ కారణాలచేతైనా ప్రపంచ రవాణా వ్యవస్ధ అస్తవ్యస్తమైనప్పుడు గానీ, ఏ దేశంతోనైనా వైరం ఏర్పడినప్పుడు గానీ మన దేశ ఆర్థిక వ్యవస్థ, అలాగే రక్షణ వ్యవస్థ స్తంభించిపోకుండా డిఫెన్స్, లాజిస్టిక్స్, ఎనర్జీ, రేర్ మినరల్స్ లాంటివి తయారు చేసే సంస్థలు మన దేశంలోనే ఉండటం, మన దేశస్తుల ఆధీనంలో ఉండటం ఆవశ్యకమే. కాబట్టి పైన ఉదహరించిన రంగాల్లో ప్రభుత్వరంగ సంస్థలు లేదా పేరు మోసిన ప్రైవేటు సంస్థలు ఉండటం మంచిదే. కానీ రఫాలే యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో చూశాం కదా. ప్రభుత్వ సంస్థ HAL ని కాదని, ఆ రంగంలో ఎంతో కొంత అనుభవమున్న TATA గ్రూప్ ని కాదని ఏమాత్రం అనుభవం లేని అనిల్ అంబానీకి కట్టబెట్టారు. గత పదకొండేళ్ళగా భారీ పోర్టులు, విమానాశ్రయాలు, ఎనర్జీ, మైనింగ్ లాంటి రంగాల్లో అదానీ గ్రూప్ దే పైచేయి ఎందుకవుతుందో, కొన్నిసార్లు ప్రభుత్వరంగ సంస్థలకి కూడా అవకాశం ఎందుకు దొరకట్లేదో ఆలోచించండి. నిన్నగాక మొన్న బీహార్లో వెయ్యి ఎకరాలకి పైగా భూమి రైతుల దగ్గర సేకరించి అదాని పవర్ కి ఎకరానికి రూపాయి లెక్కన లీజుకిచ్చారు.

    ప్రస్తుతం నెలకొన్న వాతావరణంలో స్వదేశీ, స్వావలంబన పేరుతో వేరే రంగాల్లో కూడా అతికొద్ది స్వదేశీ మిత్రులకే పెద్ద పీట వేసే ప్రమాదముంది. కాబట్టి చివరాఖరిగా నేను చెప్పొచ్చేదేంటంటే స్వదేశీ పేరుతో నాణ్యత, ధరల విషయంలో రాజీ పడొద్దు. ప్రభుత్వ యంత్రాంగం వస్తు నాణ్యత విషయంలో జవాబుదారీతనం చూపించేలా నిలదీస్తూనే ఉండండి. ఆత్మ నిర్భరత కొన్ని రంగాల్లోనే అవసరం, అక్కడ కూడా ప్రభుత్వ కాంట్రాక్టులు, లైసెన్సులు పారదర్శకమైన పద్దతిలో నిర్ధారించబడేలా ప్రభుత్వాన్ని కోరండి.

  • స్వదేశీ నినాదం చెరువు మీద అలగటం లాంటిది

    విదేశీ మార్కెట్లలో మనకి ఇబ్బందులు ఎదురైనప్పుడో లేక విదేశాలు మనని చులకన చేశారు అనుకున్నప్పుడో మనకి సర్రుమని వస్తుంది – ముందుగా కోపం, తరువాత స్వదేశీ నినాదం. స్వదేశీ వస్తువులు మాత్రమే కొనటం అంత గొప్ప విధానమైతే ఎప్పుడూ అదే దారిలో నడవొచ్చుగా. మన దేశంలో దాదాపు 1991 దాకా అదే విధానం అమలయ్యింది. స్వాతంత్య్రం వచ్చాక అప్పటి ప్రధాని నెహ్రూ, ఆయన తర్వాతి ప్రధానులు కూడా విదేశీ కంపెనీలకు తలుపులు మూసి స్వదేశీ, స్వావలంబన విధానాలే పాటించారు.

    యూరోపియన్ వలస పాలకులు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని ఎన్నో దేశాలకు వ్యాపారం పేరుతో వెళ్ళి వందల ఏళ్ళు పాటు అధికారం చలాయించిన నేపధ్యంలో, సోవియట్ యూనియన్‌లో ఏర్పడ్డ సోషలిస్టు ప్రభుత్వం వ్యవసాయంతో సహా అన్ని రంగాల్లో ప్రజా ప్రభుత్వం అద్భుతంగా నడుపుతుందన్న ప్రచారం ఉన్న నేపధ్యంలో ప్రధాని నెహ్రూ కూడా చాలా తక్కువ రంగాల్లో విదేశీ వాణిజ్యానికి ఆస్కారం ఇచ్చారు. చాలా రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థల గుత్తాధిపత్యానికి, కొన్ని రంగాల్లో పరిమితంగా ప్రైవేటు సంస్థల ఉనికికి అవకాశమిచ్చారు.

    ఫలితమేంటో అందరికీ తెలుసు. ఏ వస్తువు కావాలన్నా కొరత..ఆఖరికి బియ్యం, చక్కెర లాంటివి కూడా. ఒకవేళ దొరికినా నాసిరకం నాణ్యత. అది ఉప్పూ పప్పూ కావొచ్చు, రేడియో, సైకిల్ కావొచ్చు. కారణమేంటంటారు? తయారీదారులు పోటీకి భయపడాల్సిన అవసరం లేకపోవడం, దానికితోడు అప్పుడూ ఇప్పుడు కూడా వస్తు నాణ్యతను పరిరక్షించాల్సిన ప్రభుత్వ అధికారులు లంచాలకు అమ్ముడుపోవడం.

    1991 ఆర్థిక సంస్కరణల తర్వాత విదేశీ వస్తువులు, వ్యాపారులకు మన మార్కెట్‌లో ప్రదేశం లభించినాకే ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. పోటీతత్వం పెరిగింది. నాణ్యత, ధర ఆధారంగా వినియోగదారులు తమకి నచ్చిన వస్తువులను, సేవలను ఎంచుకునే అవకాశం లభించింది. దానివల్ల దేశీయ వ్యాపారులు కూడా నాణ్యత, మన్నిక, కస్టమర్ సర్వీస్ మీద దృష్టి పెట్టి కొందరు మనగలిగారు, కొందరు చరిత్రలో కలిసిపోయారు. లాభపడింది ప్రజలే కదా.

    మరి ఇప్పుడు స్వదేశీ నినాదం ఎందుకు?

    ట్రంప్ చర్యలతో గాయపడిన హృదయాలకు కొంత సాంత్వన లభిస్తుంది. అలాగే స్వదేశీ అనగానే అదో దేశభక్తిని ప్రతిష్ఠించే చర్యలా అనిపిస్తుంది. కానీ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మార్కెట్లో పోటీ తగ్గితే నష్టపోయేది ప్రజలే. ఇది చెరువు మీద అలగటం లాంటిది.

    ఇక్కడ ఒక ఆర్థిక సూత్రం గురించి మాట్లాడుకోవాలి- ‘కంపేరిటివ్ ఎడ్వాంటేజ్’. అనగా.. ఏ దేశం కూడా అన్ని రకాల వస్తువులను, సేవలను అతి తక్కువ ఖర్చుతో, మంచి నాణ్యతతో తయారు చేయలేదు. ఒక్కో దేశానికి కొన్ని సహజ సిద్ధమైన వనరులు, కొన్ని యోగ్యతలు ఉంటాయి. దానివల్ల కొన్ని వస్తువులు అక్కడ తయారు చేస్తే మంచి నాణ్యతతో పాటు తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఆ వస్తువులను అక్కడి నుంచి దిగుమతి చేసుకుని, మనం బాగా తయారు చేయగలిగే వస్తువులను ఎగుమతి చేయటమనేది తెలివైన పని.

    మరి ట్రంప్ ఎందుకు మన ఎగుమతుల్లో కొన్ని వస్తువుల మీద సుంకాలు పెంచి ఆ ఎగుమతులను ఆపే ప్రయత్నం చేస్తున్నాడు? అతనికి ఈ మాత్రం ఆర్థిక సూత్రాలు తెలియవా? అతను తమ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో తయారయ్యే ఆహార ఉత్పత్తులను మనకి అమ్మాలనే ఉద్దేశంతో ఈ వ్యూహాన్ని ఎంచుకున్నాడు. తద్వారా నష్టపోయేది ఆ దేశ ప్రజలే. ఎందుకంటే నగలు,దుస్తులు,రొయ్యలు లాంటి వస్తువులని ఇప్పుడు ఆ దేశప్రజలు ఎక్కువ ధరలకు కొనుక్కోవాల్సొస్తుంది. అలాగే ట్రంప్ మనదేశానికి ఎగుమతి చేద్దామనుకున్న ఆహార ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించి మోడీ ప్రభుత్వం ఆయా పంటలు పండించే మన దేశ రైతులకు మేలు చేస్తుంది కానీ మన దేశంలోని వినియోగదారులకు నష్టం కలుగుతుంది. ఈ నిర్వాకం చాలక స్వదేశీ నినాదం ఎత్తుకోవటం మోదీ ప్రభుత్వానికి రాజకీయంగా ఉపశమనాన్ని కలిగిస్తుందేమో గానీ ప్రజలకు నష్టమే. కానీ ఆ విషయం ప్రజలు ఆలోచించుకునే అవకాశమివ్వకుండా దేశభక్తి అస్త్రాన్నిప్రయోగించటం చాలా తెలివైన పని కదూ.

    7