ఈ ప్రపంచమే మహా స్మశానం!

ఈ ప్రపంచమే మహా స్మశానం, చావులు-పుటకలే ఉన్నాయి ఇక్కడ!

జారిపోవడానికో జాతి,

కుళ్ళిపోవడానికో కులం,

మోసపోవడానికో మతం,

విడిపోవడానికో వర్గం,

గందరగోళానికో గుంపు,

అవే ఉన్నాయి ఇక్కడ, మనిషి అస్థిత్వం స్థిరం నాస్తి!

ఈ ప్రపంచమే మహా స్మశానం, చావులు-పుటకలే ఉన్నాయి ఇక్కడ,

మితృ-మితృ-శతృవుల్లెవ్వరూ లేరిక్కడ,

అవసరాలేమి లేవిక్కడ, ఆకలి, వాంఛల అవకాశాలు మాత్రం ఉన్నాయిక్కడ

ఆకలి కేకలి ఆలోచన్లు , వాంఛల ప్రకోపాలు అవే ఉన్నాయి ఇక్కడ,

పూడ్చిపెడితే మట్టైపోతావు,

తగలబెడితే మసైపోతావు,

నీదేం ఆలోచన?, నీదేం ప్రకోపం?

స్మశానంలో యుద్ధమూ ఉండదూ, శాంతీ ఉండదూ!

ఈ ప్రపంచమే మహా స్మశానం, చావులు-పుటకలే ఉన్నాయి ఇక్కడ!

#అంతర్వాహిని

1

Comments

4 responses to “ఈ ప్రపంచమే మహా స్మశానం!”

  1. Ghouse Hyd Avatar
    Ghouse Hyd

    అద్భుతం!!

    1. అంతర్వాహిని Avatar
      అంతర్వాహిని

      థాంక్యూ గౌస్ సాబ్!

  2. Jagan Mantha ఒక అనుసంధాన కర్త Avatar

    చాలా బాగా రాసేరు ..

    చిన్న నిడివిలోనే వైవిధ్య భావోద్వేగాలు స్పృశించారు ..

    ఆవేశం / ఆక్రోశం / నైరాశ్యం / వైరాగ్యం ఇలాటి విషయాలన్నీ ఇంత చిన్ని నిడివిలోనే పలికించేశారు

    1. అంతర్వాహిని Avatar
      అంతర్వాహిని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *