Category: వృత్తి, ఉద్యోగం / Career

  • మీ జీవితంపై బాగా ప్రభావం చూపిన మూడు పుస్తకాల పేర్లేమిటి?

    మీ జీవితంపై బాగా ప్రభావం చూపిన మూడు పుస్తకాల పేర్లేమిటి?

    మూడు పుస్తకాలు అని కాకుండా మూడు విధానాలు అని చెప్పాలంటుకుంటున్నాను

    చదివి/చూసి/విని తెలుసుకొనే పధ్ధతి

    పుస్తకాలు/నాటకాలు / సినిమాలు / ఇలా వివిధ విషయాలు అన్నవి ఇక్కడ వస్తాయి – పాఠ్య పుస్తకాలు మాత్రమే కాకుండా మిగతా పుస్తకాలు చదవుచ్చు చదవాలి అన్న విషయం చిన్నతనం నించే అలవాటు కావడం ఒక విధముగా మంచి అలవాటే అది చిన్నప్పుడే మొదలు అయింది (knowledge through books/radio/movies/tv/other art forms like stage plays/dance forms etc – mostly through consumption & reflection ) –

    ఒక విధంగా ఇది మొదటి దశ

    మన ఆచరణ / ఇంకొకరికి నేర్పించే క్రమం లో మనం ఆకళింపు చేసుకొనే పధ్ధతి

    కేవలం పుస్తకాలు చదివితే ప్రభావం అనుకున్నంత మేరకు జరగదని కొంత ఆలస్యంగా తెలుసుకున్నా చేయడం మీద దృష్టి కొంతలో కాకపోతే కొంతలో పెరిగింది – ఆ దిశగా గత 20 ఏళ్లగా కొంచం కొంచంగా పెరిగింది (professional skills) ఈ పధ్ధతి లో నే నేను ఒక మానేజ్మెంట్ మరియు లీడర్షిప్ స్కిల్స్ ట్రైనర్ రూపం దాల్చాను , దాని వలన ఇంకోళ్ళకి నేర్పే ప్రక్రియ లో మనం నేర్చుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుందని గ్రహించాను.

    నాకు తెలిసింది రాత పూర్వకంగా తెలిపితే అది వేరే వారితో పాటు నాకు కూడా లాభదాయకంగా ఉంటుందన్న విషయం కూడా ఒక ముఖ్యమైన ఆచరణ చేసే విషయం నాకు సంబంధించిన వరకు

    ఒక విధంగా ఇది రెండవ దశ

    ఇంకొకరి నించి వైవిధ్యమైన విషయాలు ప్రత్యక్ష అనుభూతి తో సంగ్రహించే పధ్ధతి

    ఒక కంపెనీ లేదా ఆర్గనైజషనల్ ఎన్విరాన్మెంట్ లో అంత ఎక్కువ వైవిధ్యం ఉండదని అన్న విషయం , కొంత ఆలస్యంగా తెలుసుకుని ఎక్కడైతే వైవిధ్యం ఎక్కువ ఉంటుందో అలాటి విషయం గ్రహించి ఆయా విషయాల్లో ఇంకా ఎక్కువ సాంగత్యం ద్వారా వాతావరణం లో నేర్చుకునే పధ్ధతి

    – ఆ దిశగా 2013 నించి అడుగులు (increased focus on life skills & learning thru different associations – examples Landmark (forum) & BNI or similar forums for diversified networking, art of living, various forums like ICF, IAF and similar forums, owning up and cheerleading of initiatives like overall wellness, dasubhashitam, Podcasting diverse accomplished people etc)

    the journey continues …

    1
  • కనాట్ ప్లేస్ కథలు (ఎండీ నుండి లేఖ)

    బ్యాంక్ ఉద్యోగంలో కఠిన మైనది,అందరూ కోరుకునేది foreign Exchange(Forex) dept. అంతా రూల్స్ మయం. అందులోకి వెళ్ళాలంటే అప్పట్లో తెల్లజుట్టు అధమం. అటువంటి dept కు నన్ను పోస్ట్ చేశారు. అందులోనూ probation లో.నాకప్పుడు 25 ఏళ్ళు నిండలేదు.అందులో న్యూఢిల్లీ మెయిన్ బ్రాంచ్. వామ్మో ! అసలు ఎవరూ ఊహించలేని పరిణామం..ఇంపోర్ట్స్ హెడ్ గా వెళ్ళా.

    నా పక్కన తల నెరిసిన ఓ అరవతను ఎక్సపోర్ట్స్ హెడ్. పొద్దున వెళ్తే సాయంత్రం 7 వరకు పని అంతా ఔపోసన పట్టటం. ఓ రెండు నెలలు గడిచాయి. 16 బ్రాంచీలు నాకు reporting (jk నుండి mp వరకు.) .పని మీద పట్టు బాగా సంపాదించా.

    ఆ సమయంలో ఒక సమస్య వచ్చింది. ఘజియాబాద్ HCL అకౌంట్ నా పరిధి లోనిది. అప్పుడు వాళ్ళు ఏనుగంత కంప్యూటర్లు చేసేవారు. వాళ్ళ పర్చేస్ హెడ్ వచ్చి మేనేజర్ కేబిన్ లో వెళ్ళి imports అని అన్నాడట. మానేజర్ కుముదం మ్యాగజిన్ చదువుతూ గో టు ghouse అన్నాడట.వాడికి కోపం నెత్తి కెక్కి నాట్యమాడింది. कौन से गधा को बिठाया అని చిందులు.నేను “77” కూల్ డ్రింక్ తెప్పించి విషయం అడిగా. నువ్వు కొత్తవాడివి.నీకు తెలియదు పో అన్నాడు.

    సంగతి : సీకో జపాన్ నుండి పార్టులు import చేయటానికి HCL తరపున మా బ్యాంక్ ఒక LC ఇష్యూ చేసింది. అది yen currency లో ఉన్నా కూడా సీకొ కు నష్టం వస్తుందని(విదేశీ మారక ద్రవ్యం వల్ల) imports ఆపేస్తామని టెలెక్స్. వాళ్ళకి yen లో నే డబ్బు కావాలంట. మాకా జపాన్ బ్యాంకులలో yen acct లేదు. మాకున్న పౌండ్ అకౌంట్ నుండి మారకం వల్ల వాళ్లకు నష్టం వస్తుందని సప్లై ఆపేశారు. నేను విని నాకు 4 రోజులు టైం ఇప్పించండి అని బామాలి పంపించేశాను.

    నాకు ఏమి పాలుపోలేదు. పక్కన ఎక్సపోర్ట్స్ వాడికి చీమ కుట్టినట్టు కూడా లేదు.ఆ రోజంతా ఆలోచించా.

    మా బ్యాంక్ పౌండ్ అకౌంట్ NatWest bank లో ఉంది.మా సుత్తి బ్యాంక్ అకౌంట్ NatWest లో ఉండగా లేంది, NatWest లాంటి పెద్ద బ్యాంక్ వాళ్ల yen acct అతి పెద్దదైన బ్యాంక్ ఆఫ్ టోక్యో లో ఉండదా అని ఆలోచించా.

    feeble logic.

    నాకు ఎవరూ ఊహించని ఆలోచన వచ్చింది. నేను NatWest bank వాళ్ళ yen acct ను ఆపరేట్ చేస్తే ఎలాగుంటుంది?

    ఎలా..అని సంశయం. సరే మూడు పేజీల ఉత్తరం NatWest కు రెడీ చేశా.telex ద్వారా పంపాలి. నాకా telex టైపింగు రాదు. మేనేజర్ కు చూపిస్తే ఇది కుదరదు అని అంటారు. ఎలా?

    మా బ్రాంచ్ బ్యూటీ(నాకు బులుగు స్వేట్టర్ అల్లి గిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి- ఆముచ్చట మరో సారి ) దగ్గరకు వెళ్ళి Cavendish లో ఐస్ క్రీం ఇప్పిస్తా..నాకు మెసేజ్ టైప్ చేసి పెట్టు అన్నా. మేనేజర్ సంతకం పట్రా అంది.లేదన్నా.

    నాకు టైపు చేసి perforated paper ribbon పంచ్ చేసి ఇవ్వు. నేనే ట్రాన్స్మిట్ చేసుకొంటా.. అని అడిగా..సరే అని ఒక మెలిక పెట్టింది. తనను సినిమా కు తీసుకొని వెళ్ళాలి అంది నవ్వుతూ. నేను కుదరదు.ఐస్క్రీమ్ మాత్రమే అన్నా.ముందు ఒప్పుకోలేదు. సినిమా అంది. I was firm. చివరకు నేను బండోడు అని నిర్ధారించుకొని సరే అని పేపర్ రిబ్బన్ కట్ చేసి పద ఐస్ క్రీం ఇప్పించు అంది.

    నేను ఐస్ క్రీం తనతో బాటు గబగబ తింటుంటే అలా తినకూడదు అని నాకు క్లాసు పీకింది. అమ్మాయి తో వచ్చినప్పుడు కొంప లంటుకు పోతున్నాయని ఐస్ క్రీమ్ తిన కూడదు. కబుర్లు చెపుతూ ఒక గంట స్పెండ్ చేట్టాలి అని ఎలిమెంటరి క్లాసు పీకింది. వింటం తప్పదుగా..

    గంట తర్వాత Cavendish నుండి బయట పడి , బ్రాంచ్ కు వచ్చి నా దగ్గర ఉన్న code book నుంచి కోడ్ కంప్యూట్ చేసి telex రూం కు వెళ్ళి మెసేజ్ ట్రాన్స్మిట్ చేసేసా.. దాని కాపీ బ్యాంక్ ఆఫ్ టోక్యో కు కూడా పంపేశా.

    మూడురోజులు గడిచాయి.నాకు నిద్ర పట్ట లేదు. నాలుగో రోజు రెండు telex మెసేజ్ లు వచ్చాయి. ఒకటి NatWest నుండి. వాళ్లు “ మీ problem అర్థం అయింది. As a special case మీరు ఈ క్రింద తెలిపిన 16 కరెన్సీల బ్యాంక్ అకౌంట్లు మా తరపున ఆపరేట్ చేయవచ్చు కాని ఒక రోజు ముందు తెలియపరచండి.” నేను ఎగిరి గంతు వేశా.

    రెండో టెలెక్స్ బ్యాంక్ అఫ్ టోక్యో నుండి. “మాకు NatWest నుండి అనుమతి వచ్చింది.వాళ్ళ అకౌంట్ మీ తరపున డెబిట్ చేశాము.శీకో కు నిన్ననే అమౌంట్ క్రెడిట్ చేసాము”. నేను గాల్లో తేలుతున్న ఫీలింగ్.

    ఇంతలో ఘజియాబాద్ నుండి ఫోన్. HCL purchase హెడ్ సంతోషం గా నా parts airlift అయ్యాయి అంటూ రేపు అశోక లో లంచ్ అన్నారు. సున్నితంగా రాలేను అని చెప్పా.

    ఇక నేను జరిగిన కథ అంతా సెంట్రల్ ఆఫీస్ కు 4 పేజీల foolscape టైప్ చేయించి,telex కాపీలు జత చేసి మేనేజర్ దగ్గరకు వెళ్ళాను.ఆయన ఒక పేజీ చదివి అగ్గి మీద గుగ్గిలం అయ్యారు.నువ్వు ఫ్రాడ్ చేశావు.నేను సంతకం చెయ్యను. అన్నారు.నేను లేని ఓపిక తెచ్చుకుని మొత్తం వివరంగా చెప్పాను..వింటేగా? NatWest ను ఒప్పించగలిగా.. నా మే నేజర్ ను ఒప్పించలేక పోతున్నా.కోపం వచ్చేస్తుంది.

    ఇక లాభం లేదని.. సర్ fraud అని సెంట్రల్ ఆఫీస్ తేలిస్తే నన్ను ఉద్యోగం నుండి పీకేస్తారు.మీకెంటి అన్నా. ఊహు! సంతకం పెట్టనన్నారు. నేను ఆయన పెన్ను టేబుల్ పై నుండి తీసుకొని “yours truly ..Manager “ దగ్గర Slash పెట్టి నేను నా ఫుల్ సంతకం చేసి పేరు రాసి పక్కన Probationary officer అని రాశా. (PO అదేదో పెద్ద designation అయినట్టు). ఆయన నన్ను ఎంత ధైర్యం? వెంటనే Forex deptనుండి వెళ్ళిపో అన్నారు. నేను సెంట్రల్ ఆఫీస్ నుండి జవాబు వచ్చిన తర్వాత వెళ్తాను అని బయటకు వచ్చి ఆ లెటర్ despatch లో ఇచ్చేసా.

    ఒక వారం తర్వాత సెంట్రల్ ఆఫీస్ నుండి ఒక పెద్ద లెటర్. Ghouse గారికి .”మీరు ఇలా మాకు ముందు చెప్పకుండా చెయ్యటం పద్ధతి గాదు. ఇక ముందు మా పెర్మిషన్ తీసుకోండి. మీరు సజెస్ట్ చేసినట్టు మేము yen acct Japan లో Dai-ichi Kogyan బ్యాంక్ లో ఓపెన్ చేశాము.దాని నంబర్ క్రింద ఇస్తున్నాం”

    Manager లెటర్ చదివి చూసావా..నే చెప్పాగా. నా మాట వింటేగా? అన్నారు. నేను వెంటనే నేను చేసింది ఫ్రాడ్ కాదు గా అన్నాను.ఆయన గుర్రుగా చూశారు.

    రెండో లెటరు నా పేరు మీద సీల్డ్. MD ఆఫీస్ నుండి.ఓపెన్ చేశా. నేను చేసిన పని ఔట్ Of box అని మెచ్చుకొన్నారు. చివరన అన్నివేళలా అప్రమత్తం గా ఉండాలి ఇటువంటి undocumented protocols attempt చేస్తున్నపుడు అని ముగించారు. ఆ లెటరు మేనేజర్ చూసి అరే MD letter నాకు ఇంతవరకు రాలేదు. నీకు వచ్చింది అని అంటూనే చూసావా నువ్వు చేసింది రూల్ ప్రకారం కాదు అన్నారు .

    నువ్వు రూల్ ప్రకారం ముందస్తుగా నా అనుమతి తీసుకో లేదు. కాబట్టి Forex నుండి నిన్ను FD dept కు ట్రాన్స్ఫర్ చేస్తున్నా అని చెప్పారు. నేను కూడా నిశ్చయించుకొన్నా ఇంక అక్కడ కుదరదు అని. Ok sir అన్నా.

    కానీ మేము నలుగురు PO లం చంద్రశేఖర్ అని ఓ Forex guru ఉండేవారు. ఆయనను ఒప్పించి రోజూ Office hours తర్వాత 6–8pm Forex ఓ 5 నెలలు నేర్చుకున్నాం.

    కొసమెరుపు: కట్ చేస్తే. ఆ మే నేజర్ గారు 1987 లో Hyd కు జోనల్ మేనేజర్ గా వచ్చారు.అప్పుడు నేను నల్లకుంట బ్రాంచ్ మేనేజర్ .అందరూ airport కు వెళ్ళాం. ఆయన అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ నా దగ్గరికి వచ్చి నువ్వు ఇక్కడున్నావా ? అని కొంచెం సేపు నా చేతిని వదల్లేదు. తర్వాత భుజం మీద చెయ్యి వేసి కారు వరకు నాతో నడిచారు.

    ( వీడు ఇక్కడ కూడా దాపురించాడా అని మనసులో అనుకోని ఉంటారేమో ఆయన ) .

  • జీవితంలో మీకు వచ్చిన కష్ట సమయాన్ని ఎలా ఎదుర్కొన్నారు?

    జీవితంలో మీకు వచ్చిన కష్ట సమయాన్ని ఎలా ఎదుర్కొన్నారు?

    కొన్ని ప్రశ్నలు మన పరిధి కి మించినవి ఉంటే వాటిని అంచలంచలుగా address చెయ్యాలి అన్న మాట నాకు నేను చెప్పుకునే సూత్రం – ఈ సమాధానం నేను బహుశా 4/5 ఏళ్ళ క్రితం తెలుగు కోరాలో మొదటి సారి వివరించే ప్రయత్నం చేశాను. ఆ తర్వాత పునఃసమీక్ష ఎలాగూ 15/18 నెలల్లో తిరిగి జరుగుతూ ఉంటుంది

    “కోతీ కొమ్మచ్చి” మొదటి భాగంలో అనుకుంటా (బాపు) రమణ గారి ఉపోద్ఘాతం గుర్తుకు వచ్చింది

    జీవితంలో తియ్యనిది ఏది ?

    అన్న ప్రశ్నని వేసి దానికి బహుసామరస్యంగా రసభరితమైన జవాబు ఇస్తారు అయన

    స్నేహం అని, ఆలా ఆన్సర్ ఇవ్వగానే దాన్ని ఆల్రెడీ తీసాం అని ఇంకో జవాబు

    అంటే సినిమాగా హిందీ లో ఆల్రెడీ తీసేసారు అంటూ పలు పలు విధాలుగా

    తియ్యనైన విషయం ఏది అన్న మాటని బహు విధాలుగా నవరసాలతో చమత్కరించి

    దాటేసిన రేవు ; గడిచిపోయిన కష్టాలు బహు తీపి అని ఒక అభిప్రాయాన్ని వెలుబుస్తారు

    ఈ మాట ప్రకారంగానే పడిన కష్టాలలో నే ఇష్టాలు వెతుక్కున్న జీవితం నాది

    కష్టాలు అంటే సినిమా కష్టాలు మాత్రం కావు

    చెప్పాలంటే ఒక విధమైన ప్రివిలెజ్డ్ జీవితమే మొదటి ముప్పై ఏళ్ళు

    ఒక టిపికల్ మిడిల్ క్లాస్ జీవితం బాధ్యత గల తల్లితండ్రులు మేము మొత్తం ముగ్గురం – ఒక అక్క ఒక తమ్ముడు మధ్యలో నేను – అందరం చదువులు బాగానే చదివి అక్క డాక్టర్ – మేమిద్దరం ఇంజినీర్లం అంతా బాగానే ఉండేది

    నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం వలన ఫామిలీ మొత్తంలో మొదటి విదేశ యాని ఒక

    నాలుగు ఏళ్ళు లండన్ మరియి అమెరికాలలో తాత్కాలిక వర్క్ పర్మిట్ లతో

    కానీ నా పెళ్లి అయ్యిన రెండు ఏళ్లలోనే అమ్మకి కలిగిన తీవ్ర మోకాటి నొప్పులతో కలిగిన ఆరోగ్య సమస్య, ఆ తరువాత మోకాళ్ల ఆపరేషన్ అది అప్పటికి సక్సెస్ అయినప్పటికీ కొన్ని నెలల కు అమ్మ / నాన్నగారు విడిగా వైజాగ్ లో వుంటున్నప్పడు అమ్మ ఇంట్లో జారి కాలు విరగడం, ఆ తర్వాత ఆమె అతి కష్టం మీద నడుస్తూ ఉండడం, ఇంక ఇలా కాదని అందరమూ కలిస్తే ఉందాం అని అమ్మ / నాన్నగారు ఇరువురు నా ఇమ్మీడియేట్ కుటంబంతోనే కలిసి ఉందాం అని హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోవడం, aggressive arthritis ఇంకా ఇంకా వృద్ధి చెంది క్రమ క్రమంగా అమ్మ ఎక్కువగా వీల్ చైర్ లోనే శేషజీవితం గడపాల్సి రావడం)

    ఈ ప్రహసనం ఫామిలీ మొత్తం సమగ్రంగా ఎదుర్కొనే కష్టం అది చాలా కాలం సాగడం వలన క్రమ క్రమంగా మా ఫామిలీ రకరకాలుగా రూపాతరం చెందింది అని చెప్పాలి

    అందులో ముఖ్యమైనది నేను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు మానేజ్మెంట్ ట్రాక్ లని వీడి ట్రైనింగ్ వైపు పయనించడం (లైఫ్ బాలన్స్ కోసం అని నా భావన)

    దాన్నించి ఇంకోళ్ళకి పాఠాలు (సాఫ్ట్ స్కిల్స్) నేర్పే బాటలో పాట్లు పొరపాట్లు దాన్నించి కొత్త పాఠాలు అది ఒక ప్రహసనం నించి ఇంకో ప్రహసహనం వైపు వెడుతూ గడుపుతున్న జీవితం (Transitions)

    ఒక కార్పొరేట్ జాబ్ వదలాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత కొంచం కష్టాలు పెరిగాయి – సామర్ధ్యం కూడా పెరిగింది కానీ కావాల్సిన మేరకు ఇంకా పెంచుకొనే కష్టం మరియు దాంతో మిళితమైన ఇష్టం లో ప్రస్తుతం నేను

    అమ్మ 2010 లోనే భౌతికంగా వెళ్ళిపోయుంది కానీ నాన్నగారి సాంగత్యం మాత్రం Jan 2025 వరకు ఒకే చూరు క్రింద కొనసాగడం ఒక విధంగా నా అదృష్టం.

    ఆయన పాతిక ఏళ్ళ రిటైర్డ్ లైఫ్ లో సింహభాగం ఒకేచూరు క్రింద కలిసి ఉండడం – ఇది వేరే లెవెల్ కి చెందిన ప్రివిలేజ్ తరచి చూస్తే

    ఆయన పదాల్లో పదనిసలు / పెడసరాలు / పద నషాలు అధ్యయనం చేసే అవకాశం కాస్త సావధానంగా లభించడం, వాటిలో అన్యాపదేశం గా వున్న సందేశాల్ని వడిసిపట్టడం నాకు వ్యక్తిగతంగా లభించడం, ఆయనకు వివరించి చెప్పే అలవాటు లేదు (తరచి తరచి అడిగితే కానీ), నాది కాస్త మట్టి బుర్ర కాబట్టి నేను వెంఠనే ఆకళింపు చేసేసుకునే ప్రతిభ అంతంత మాత్రమే కాబట్టి విషయాన్ని క్రమ క్రమంగా వివరించే ప్రయత్నం చేసే రాత మాధ్యమం ఎన్నుకోవడం, దాన్ని అప్పుడడప్పుడు పునఃసమీక్ష చేసుకోవడం – ఇదంతా చాలా కాలం నడిచిన ప్రహసనం.

    వెరసి ఆయన వలన గ్రహించిన wisdom లెసన్స్ వాటిని Will, Skill & Chill (Clues for overcoming your “Transition” Blues) గా మలచడం జరిగాయి ( first time in Sept 2019)

    కరోనా సమయంలో మళ్ళీ దాదాపు రెండేళ్ల పాటు నిర్వహించిన మధ్యంతర పాలేరు (mid rung మానేజ్మెంట్ రోల్ in a mid level org) జీవితం కూడా చెట్టు ఎక్కింది

    కావున గత రెండేళ్ల సమయంలో నేను ఈ మధ్య కాలంలో ఎక్కవగా వినవస్తూ వున్న SAD అంటే స్ట్రెస్ / ఆంక్సిఏటీ / డిప్రెషన్ అన్న విషయాలపై కాస్త అవగాహన పెంచుకుని CBT (కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ) అన్న విషయంలో కౌన్సిలింగ్ సర్టిఫికెట్ ని తీసుకుని నా లైఫ్ కోచింగ్ అన్న విషయంతో పాటు అవసరమైనప్పుడు కౌన్సిలింగ్ చేయడం అన్న విషయం లో అధ్యయనం మరియు ఆచరణ (ప్రాక్టీస్) పెంచుకుంటూ సాగుతున్నా

    దాదాపు 6 ఏళ్ళ తర్వాత ఈ పుస్తకాన్ని (Will, Skill & Chill – Clues for overcoming your “Transition” Blues) మరి కొంత కంటెంట్ మరియు ఇంకో టాగ్ లైన్ (In a Post Covid and AI-first world) జోడించి విడుదల చేయడం జరిగింది.

    The mentioned is Both Amazon & Flipkart listed – check with my full name (Jagan Mantha – if interested)