ఊరు నల్లగొండ. పేరు మల్లికార్జున్. ట్విట్టర్ అవతారం (X account) @insidemalli. చదువు పూర్తయిందన్న నాటికి ఇంజినీరుగా డిగ్రీ చేతిలో. రాయాలని దాచుకున్న కథలెన్నో మనసులో. ఉద్యోగం కొంత కాలం “సాక్షి,” “వెలుగు”పత్రికలలో. ఎలాగూ కలం చేతిలో. ఇక చుట్టూ చూసిన, చూస్తున్న లోకం, రెక్కలు కట్టుకు ఎగిరే తన ఊహాలోకం… రచయితగా సాకారం!
ఇరానీ కేఫ్, కాగితం పడవలు, నల్లగొండ కథలు.. రచయిత మల్లికార్జున్ కథలు ఎంత పాప్యులర్ అయినాయంటే, ఎంతగా చదువరుల ఆదరణ పొందాయంటే, కాగితం పడవలు అచ్చై, అమెజాన్లో అందుబాటులో ఉందన్న రోజే, “అన్నా పీడీఎఫ్ ఉంటే పంపుతావా?” అని వాట్సాప్ సందేశాలు అందుకునేంత!
తన కథలు పుస్తకంగా ముద్రించుకోవటానికి, తనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకుని, తన పాఠకులను నేరుగా చేరాలనే ప్రయత్నంగా “అజు పబ్లికేషన్స్” ప్రచురణ సంస్ఠ స్థాపించి, తనతో పాటు మరెందరో కథకులను కూడా తెలుగు సాహితీ లోకానికి పరిచయం చేసాడు. ఈరోజు వారంతా మనకు సుపరిచితులవటానికి తను ఊతమయాడు.
ఇందులో మాకు తెలీని విషయాలేమున్నాయనీ… నీకెంత దగ్గరో, మాకూ అంత సన్నిహితుడేగా అని విసుగుపడేవు.. అందుకే, ‘నీకు నా ప్రేమ,’ అనే వాక్యంతో మనందరికీ దగ్గరై, అందరినుండీ అంతులేని అభిమానం అందుకున్న మన నేస్తంతో కాసేపు. ఐతే ఇందులో ఓ చిన్న తిరకాసుంది. వీడు చెప్పేవన్నీ ‘ఔను కథలే…’నో, ‘ఔను కదా!’లో, మనకెలా తెలుస్తుంది?! అందుకే మేం కూడా గెలివిగా పలుకు.ఇన్ టీమ్నుండి ఓ కథా రాకాషి.ని బర్లోకి దింపాం! గిచ్చు, గిల్లు, నడ్డిమీన్నాలుగు ఛంపెయ్యూ.. నీక్కొత్తగా నేరిపీక్ఖల్లా కదా. నాలుగు ప్రెశెన్లూ, వాటికి నాలుగింతలు జవాబులూనూ తే, ఫో…, గో గల్ల్ డూ యిట్టని తోలాం!
పక్క పేజీలో మల్లితో ముచ్చట. మనందరి తరఫున మాధురి. మన కోసం, తనవైపునుండి మల్లి. చదవండి. ఈ ఇంటర్వ్యూ గురించి మీ స్పందన తెలియచేయండి. మీకూ ఏమైనా ప్రశ్నలున్నాయా? అడగండి.
“ఆకుపచ్చ, పసుపుపచ్చ రెండూ వేర్వేరు రంగులు కదా మరి రెండిటినీ ‘పచ్చ’ అని ఎందుకు అంటాం?” అని ఓ పడుచుపిల్ల ప్రశ్న. “అవును కదా, ‘పచ్చ’ అనే మాటని మనం ఆకుపచ్చ రంగుకే ఎక్కువగా వాడతాం. మరి పసుపుకి కూడా పచ్చ ఎందుకు చేరుస్తాం?” అని ఈ నవవృద్ధుడికీ విస్మయం కలిగింది. తెలుసుకునే ప్రయత్నం చేస్తే తేలిన విషయమే ఈ టపా.
నిఘంటువులో ‘పచ్చ’ అనే మాటకి బంగారము, సంపద అనే అర్థాలిచ్చారు. రంగులకు వెళ్తే పసరు రంగు, పసుపు రంగు, ఆకుపచ్చ రంగు, పాలిపోయిన రంగు అని ఇచ్చారు. అక్కడే తేలిపోయింది కదా ఈ మాటను ఈ రంగులన్నిటికీ కలిపి వాడేవారని. ఇప్పుడే గుర్తొచ్చింది చిన్నప్పుడు విన్న వాడుక: ఒంటి ఛాయ గురించి చెప్పేప్పుడు తెల్లగా ఉన్నవారిని ‘పచ్చని ఛాయ’ అనేవారు. ఇదే వాడుకలో చికిలింత అనే కథలో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఇలా వ్రాసారు:
ఎదురు గుమ్మంలోకి, ఎవరో అమ్మాయి వచ్చింది. పచ్చగా ఉంది. పది పద్ధెనిమిది ఏళ్ళుంటాయి.
బంగారు, పసుపు రంగుల్లో ఉండే గిజిగాడు పక్షిని ‘పచ్చపిట్ట’ అంటారట. పాలిపోయిన ఎరుపురంగులో ఉండే రాయి ‘పచ్చసుద్ద’. ‘పచ్చగన్నేరు’ పూలు పసుపు రంగులో ఉంటాయి మరి.
‘పచ్చ’ అనే మాట ‘పస’ అనే మూలం నుండి వచ్చింది. దాన్నుండే పసరు, పసపు/పసుపు, పసిడి/పైడి అనే మాటలు వచ్చుంటాయి.
సరే, సంస్కృతపు మాటలు చూద్దాం అని ‘హరిత’తో మొదలుపెడితే దానికీ, ‘హరి’ అనే మాటకీ కూడా పసుపు రంగు, పాలిపోయిన ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు అనే అర్థాలున్నాయి. బంగారుకాంతితో ఉండే సింహం అని కూడా ఓ అర్థం. బంగారురంగులో ఉంటుంది కనుక జింకను ‘హరిణం’ అన్నారు. పసుపుని హిందీలో ‘హల్దీ’ అంటారు కదా, (హళిది) దానికీ ‘హరి’ అనే మాటే మూలం. హరీ!
దీన్నిబట్టి మనం తేల్చేదేమిటంటే… మన పూర్వీకుల పూర్వీకులకు పసుపుపచ్చకీ, ఆకుపచ్చకీ భేదం చూపించాల్సిన అవసరం రాలేదేమో!?
(ఇంతాచేసి, ‘పచ్చనోటు’ అనే మాట నోటు రంగు వల్ల కాకుండా ‘పచ్చ’ అనే మాటకి ఉన్న సంపద అనే అర్థాన్ని బట్టే వచ్చివుంటుంది.)
మీ ఐఫోన్లో సెట్టింగ్స్ తెరచి జనరల్ -> కీ బోర్డ్ దగ్గరకి వెళ్ళండి. ఇప్పుడు తెలుగు ( అక్షరమాల ) కీ బోర్డుని జోడించండి.
Screenshot
తెలుగు అక్షర మాల కీ బోర్డుని జోడించాక, మీకు కుడి పక్కన “క” అని తెలుగు కీ బోర్డు కనిపిస్తుంది.
Screenshot
ఇప్పుడు మీకు నచ్చిన అప్లికేషన్లో ఎప్పటిలానే తెంగ్లీషులో టైప్ చేస్తే తెలుగు లిప్యంతరీకరణ జరిగి మీరు టైప్ చేసింది తెలుగులో అచ్చవుతుంది.
Screenshot
మీరు తిరిగి ఇంగ్లీషు కీ బోర్డు కావాలనుకుంటే ఎడమ పక్కన ఉన్న “A” మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అదనపు భాషలు కావాలనుకుంటే పై చిత్రంలో కింద వరసలో ఉన్న భూ గోళం మీద క్లిక్ చేస్తే మీరు కీ బోర్డులో ఎంచుకున్న భాషలన్నీ కనిపిస్తాయి.
ఇక పై మీరంతా మన అందమైన తెలుగులో వ్రాయాలని ఆకాంక్షిస్తూ..
మీ మాక్లోని ఆపిల్ లోగో పైన క్లిక్ చేసి సిస్టం సెట్టింగ్స్ ఎంచుకోండి.
తరువాత సిస్టం సెట్టింగ్స్లో కీ బోర్డును ఎంచుకోండి
తరువాత టెక్స్ట్ ఇన్పుట్ సోర్సెస్లో ఇంగ్లీషుతో పాటు తెలుగు ట్రాన్స్లిటరేషన్ ఎంచుకోండి. కింద బొమ్మలో హైలైట్ చేసిన ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మీరు తెలుగు, ఇంగ్లీష్ కీ బోర్డుల మధ్య సులువుగా మారవచ్చు.
ఇప్పుడు మీ మెనూ బార్లో ఇంగ్లీషుతో పాటు తెలుగు కీ బోర్డు కూడా కనిపిస్తుంది.
ఇప్పుడు మీకు నచ్చిన అప్లికేషన్ తెరచి అందులో మీరు ఎప్పుడూ టైప్ చేసినట్టు తెంగ్లీషులో టైప్ చేస్తే దానంతట అదే తెలుగులోకి లిప్యంతరీకరణ చెందుతుంది.
ఇక పై మీరంతా మన అందమైన తెలుగులో వ్రాయాలని ఆకాంక్షిస్తూ…
నేను , శ్రీమతి ఢిల్లీ లో 1978 లో లజ్పత్ నగర్ లో సంసారం మొదలుపెట్టాం.బుడ్డోడు పాకుతున్నాడు.
భుజానికి వేళ్ళాడే సంచి లో రోజూ లంచ్ బాక్స్ , ఒక నవల , 2 రూపాయల చేంజ్.
వెళ్తానికి 60 పైసలు,రావటానికి 60 పైసలు. ఓ పది రూపాయలు రిజర్వు.పొద్దున్నే 6 కు లేచి ప్లాస్టిక్ జార్ తీసుకొని MOTHER DIARY వెండింగ్ మెషిన్ క్యూ లో నిలబడి అర లీటర్ పాలు తీసుకొని వచ్చి కాలకృత్యాలు +టిఫిన్ అవగొట్టి 9 కి బయలు దేరి రాత్రికి 8 కి వచ్చేవాడిని. ఇది దిన చర్య. ఆది వారం ఇంటి క్రింద మార్కెట్ లో మృణ్మయ పాత్రలో వడ సాంబార్.. నెల-రెండు నెలలకోసారి సినిమా . అప్పుడు చూసినవి akhion ke jharokon se +వేటగాడు +సిరిసిరి మువ్వ etc
ఇంతకుముందు చెప్పినట్లు మెయిన్ బ్రాంచ్ కనాట్ ప్లేస్ -మహా సముద్రం.
ఓ ఆరు నెలల తర్వాత నేను ఫారిన్ ఎక్స్చేంజి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నప్పటి సంఘటన :
నేను బ్రాంచ్ లో అందరితో చాలా కలివిడిగా ఉండేవాడిని. హిందీ తెలుసు కాబట్టి ( మిగతా ఆరవ ఆఫీసర్ల కాకుండ )
తొందరగా “తలలో నాలుక ” (?) లా అయిపోయాను.
ఫారిన్ ఎక్స్చేంజి డిపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేది. మేజనైన్ లో పెర్సొనెల్ +డే బుక్ +అకౌంటింగ్ సెక్షన్లు ఉండేవి. గ్రౌండ్ ఫ్లోర్ లో పెద్ద బ్యాంకింగ్ హాల్.
లిఫ్టులు లేవు.
ఒక రోజు మేనేజర్ తో గ్రౌండ్ ఫ్లోర్ లో ఏదో వాదించి మేజనైన్ ఫ్లోర్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ కు పోతుంటే, పెర్సొనెల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక అమ్మాయి ( ఢిల్లీ లో జన్మం + చదువు ఢిల్లీ యూనివర్సిటీ ) నన్ను ఆట పట్టించాలని చాలా కాజువల్ గా — గౌసు , Your upper floor is to let” అని కామెంట్ చేసింది.( అంటే నా బుర్ర ఖాళీ -అక్కడ ఏమి లేదనే అర్ధం ) .అది harmless funny కామెంట్. మేనేజర్ తో వాదులాట మైండ్ లో ఉండటం వల్ల,నేను అసంకల్పితంగా ఒక Inappropriate కామెంట్ చేశా. ఎప్పుడు నేను అలా చేయను. ఆడవాళ్ళ దగ్గర అసలు చేయను. కానీ చేశాను.అక్కడ ఉన్న 15 మంది staff లో ఓ పది మంది విన్నారు. ఆ అమ్మాయి కూడా విని,తల వంచుకొంది కానీ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. నేను పైకి వెళ్లి పోయా. సాయంత్రానికి మర్చి పోయా..
ఆ రోజు బస్సు లో ఇంటికి పోతుంటే ఇది గుర్తు కొచ్చింది. నేను తప్పు చేసానని అని ఎక్కడో గిలి. సరే, ఇంటికి వెళ్లి , స్నానం, భోజనం కానిచ్చిన తరువాత, శ్రీమతి తో ఈ సంఘటన పూర్వాపరాలు చెప్పాను. మా ఆవిడ నన్ను తీవ్రంగా మందలించింది.మీరు ఎప్పుడూ అలా మాట్లాడరు కదా?. ఏమైంది మీకు అని క్లాసు పీకి, మర్నాడు నన్ను”ఆ మేజనైన్ ఫ్లోర్ కు వెళ్లి , ఆ అమ్మాయి ఒంటరి గా ఉన్నప్పుడు కాదు, అందరూ ఉన్నప్పుడు ఆ అమ్మాయికి బేషరతు గా క్షమాపణ చెప్పండి. క్షమించమని అడగండి. మీరు చెప్పక పోతే మర్నాడు నేను వచ్చి క్షమాపణ చెప్పాల్సి వస్తుంది ” అని అల్టిమేటం జారీ చేసింది. ఆలోచించగా సబబే అనిపించింది.
మర్నాడు నేను వెళ్లి ఆ అమ్మాయి ముందు నిల్చొని అందరూ చూస్తుండగా క్లియర్ గా ” నేను నిన్న చాలా inappropriate గా కామెంట్ చేశాను.మై సిన్సియర్ apologies . ప్లీజ్ నన్ను క్షమించు ” అని చెప్పాను. ఆ అమ్మాయి shocked . తను ఊహించ లేదు.. toxic work environs అని సమాధాన పడి ఉండిపోయినట్టుంది.
అప్పుడు something strange happened.. ఆ అమ్మాయి గబుక్కన కుర్చీ లో నుంచి లేచి నా దగ్గరకు వచ్చి నన్ను hug చేసుకొని,” నేను ఇలాంటి కామెంట్లు చాలా విన్నాను. నీలాగా వచ్చి ఎవ్వరూ apologise చెయ్యలేదు. you are a Gentleman” అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకొంది. ఆ ఘటన తర్వాత ఆ అమ్మాయి నాకు చాలా మంచి నేస్తం అయింది.
ఆ రోజు రాత్రి నేను జరిగిన విషయం శ్రీమతి తో చెప్పగా ” మా వారు చాలా మంచి వారని” సంతోషం గా నన్ను కౌగిలి లో పొదువుకొంది.
జీవి తన చిత్తం తో విత్తం మరియు అంతకంటే ఇంకా ప్రాముఖ్యమైన విషయాలని గ్రహించే ప్రక్రియే జీవితం అంటే ..
జీవితమంటేనే ఉగాది పచ్చడి కూడానూ
ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్లో సినీకవులు ఏమి చెప్పారో అని చూస్తే పోలా, మీ మూడుని బట్టి మీకు ఇక్కడ లిస్ట్ చేయపడ్డ వివిధ పాటలతో మీకు ఒక కనెక్షన్ ఏర్పడచ్చు. అంటే షడ్రుచులు మరియు నవరసాలు ఆస్వాదిస్తేనే కదా తెలిసేది వర్ణన కన్నా.
పాటలన్నీ మొదటి/రెండు చరణాలలో ఎక్కడో అక్కడ జీవితం లేదా జీవన, బ్రతుకు అన్న మాట (లేదా అలాంటి అర్ధం) వస్తే అది ఒక పాపులర్ పాట అయితే దాన్ని ఈ కూర్పు లోకి చేర్చాను, ఈ పాటలన్నీ క్రానోలోజికల్ ఆర్డర్ లో అంటే పాత పాటలు ముందుగా లిస్ట్ చేస్తున్నాను. ముందుగా తెలుగు పాటలు – ఆ తర్వాత హిందీ పాటలు కూడా లిస్ట్ చేస్తున్నాను, హిందీ లో కూడా జీవన్ లేదా జిందగీ అన్న మాట లేదా అలాంటి అర్ధం వస్తే దాన్ని ఈ క్రింది కూర్పు లో కి చేర్చుకున్నాను
ప్రస్తుతానికి తెలుగు లో ఒక 37 పాటలు మరియు హిందీలో 34 పాటలు ఈ కూర్పు లో కి చేరాయి ! ఇంకా ఏవైనా తడితే వీటిలోకి చేరుస్తాను (It will be in Chronological Order)
Telugu List
దేవదాసు ( 1953) లో
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే
బ్రతుకింతేనులే బ్రతుకింతేనులే
అనార్కలి (1955)
జీవితమే సఫలమూ రాగ సుధా భరితమూ
ప్రేమ కథ మధురమూ
శబాష్ రాముడు (1959) లో
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా (ఇందులో జీవితం అన్న మాట లేకపోయినా దాదాపు అదే అర్ధం వచ్చే మోటివేషనల్ లిరిక్స్ వున్నాయి)
వెలుగునీడలు (1961) లో
కలకానిది విలువైనది బ్రతుకు
కన్నీటి ధారలకే బలిచేయకు
గుడిగంటలు (1964) లో
జన్మమెత్తితిరా అనుభవించితిరా
బ్రతకు సమరంలో అలిసిపోయితిరా అన్న పాట
(ఇది కొంచం నిరాశ నిస్పృహ అనే కోణాల్లో ఉంటుంది)
లక్ష్మీ నివాసం (1966) లో
ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనం విలువ తెలుసుకొనుట మానవ ధర్మం (యశ్వీ రంగారావు గారి పాట)
రంగుల రాట్నం (1966) అనే సినిమాలో టైటిల్ సాంగ్
జీవితమంటే అంతులేని ఒక పోరాటం
సంబరాల రాంబాబు (1970) లోనిది (ఇందులో చలం హీరో )
ఎంతో చిన్నది జీవితం ఇంకా చిన్నది యవ్వనం
అనుభవించరా
అన్న లైన్స్ తో శ్రీమంతుడు (1971) మూవీ – అక్కినేని గారి స్టైల్ లో
వాగ్దానం (1971) లో
బంగరు నావా బ్రతుకు బంగరు నావా
కలెక్టర్ జానకి (1972) లో
జీవితమే ఒక ఆట అది వెలుగు నీడల సయ్యాట అనే ఒక ముక్క (ఇది ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అని చెప్పచ్చు )
ఈ లైన్స్ మొదట్లో రాదు కానీ మధ్యలో వస్తుంది – కానీ ఇవే మెయిన్ లైన్స్
విచిత్రబంధం అన్న సినిమా(1972) లో
అందమైన జీవితమూ అద్దాల సౌధమూ
అన్న లైన్స్ తో
జీవన తరంగాలు (1973) లో
ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికీ ఎవరూ సొంతమూ ఎంతవరకూ ఈ బంధమూ
నిప్పులాంటి మనిషి (1974) మూవీ లో
స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం – సీనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ కోసం
రెబెర్ స్టార్ కృష్ణం రాజు గారి పాట అమరదీపం (1977) లోది
నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది
గోరంత దీపం (1978) మూవీ లో టైటిల్ సాంగ్ – ఇది కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీనే (ఇందులో జీవితం అన్న పదం లేకపోయినా మొత్తం సాంగ్ అంతా జీవితం పైన దృక్పధం కోసమే కదా)
దీపారాధన అన్న మూవీ(1980) లో తెల్లకాగితం మనిషి జీవితం అన్న పాట శోభన్ బాబు గారి ఫాన్స్ కోసం
ఓ బాటసారీ ఇది జీవిత రహదారీ
ఎంత దూరమో ఏది అంతమో
అన్న ఈ పాట ఇల్లాలు (1981) సినిమాలో
ప్రేమాభిషేకం (1981/82) లో నించి కూడా ఒక పాట
ఆగదు ఏ నిముషం నీ కోసము
ఆగితే సాగదు ఈ లోకము
ముందుకు సాగదు ఈ లోకము(గమనిక : జీవితం అన్న పదం లేకపోయినా – నువ్వు మరియు లోకం అన్న పదాలు వున్నాయి కదా )
పచ్చని కాపురం (1985) లో సూపర్ స్టార్ కృష్ణ శ్రీదేవి గారి సినిమా లో
వెన్నెలైనా చీకటైనా నీతోనే జీవితం
సుమంగళి (1989) లో
జీవితం ఓ ప్రయాణం – నిండుగా సాగనీ
కొండవీటి దొంగ (1990) లో
జీవితమే ఒక ఆట సాహసమే పూబాట
మెగా స్టార్ శైలి లో (రాబిన్ హుడ్ స్టైల్)
ఇలా మరిన్ని తెలుగు పాటలు – ఇప్పుడు మచ్చుక్కి కొన్ని హిందీ పాటలు కూడా
HINDI LIST
జీవన్ కి సఫర్ మే రాహీ
మిలితేహ్ బిఛడ్ జానెకో
ఔర్ దేజతేహ్ యాదే
తన్హాయి మెయిన్ తడపానెకో
మునీంజీ (1955) లో పాట
దీని అర్ధం భలే వుంది –
జీవితపయనంలో తోటి ప్రయాణీకులు కలుస్తూ వుంటారు
వెంటనే విడిపోతారు కానీ వారి జ్ఞ్యాపకాలు మాత్రం మనల్ని వంటరితనంలో చుట్టు ముడతాయి
మధుమతి (1958) లో
సుహానా సఫర్ హై యెహ్ మౌసమ్ హసీ
అనారీ (1959) లో
జీనా ఐసీ కా నామ్ హాయ్ అన్న మాటలో చరణం పూర్తి అయ్యే పాట
హమ్ దోనో (1961) సినిమా లో ఇంకో దేవానంద్ పాట
మెయిన్ జిందగీ క సాథ్ నిభాతా గయా
హర్ ఫికర్ కో ధువా మెయిన్ ఉడాతా గయా
అస్లీ నకిలీ (1962) లో
తుఝే జీవన్ కా దోర్ సే బాంద్ లియాహై
(మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది .ఇదంతా ఒకప్పుడు తెలుగు కోరాలో కూర్పు చేసినదే. మొదటి రెండు లైన్స్ తో పాటు గా యూట్యూబ్ లింక్ తో తెలుగు కోరా లో ఇదివరకే కూర్పు చేసిన లంకె క్రింద జత చేయబడింది)
కొన్ని ప్రశ్నలు మన పరిధి కి మించినవి ఉంటే వాటిని అంచలంచలుగా address చెయ్యాలి అన్న మాట నాకు నేను చెప్పుకునే సూత్రం – ఈ సమాధానం నేను బహుశా 4/5 ఏళ్ళ క్రితం తెలుగు కోరాలో మొదటి సారి వివరించే ప్రయత్నం చేశాను. ఆ తర్వాత పునఃసమీక్ష ఎలాగూ 15/18 నెలల్లో తిరిగి జరుగుతూ ఉంటుంది
“కోతీ కొమ్మచ్చి” మొదటి భాగంలో అనుకుంటా (బాపు) రమణ గారి ఉపోద్ఘాతం గుర్తుకు వచ్చింది
జీవితంలో తియ్యనిది ఏది ?
అన్న ప్రశ్నని వేసి దానికి బహుసామరస్యంగా రసభరితమైన జవాబు ఇస్తారు అయన
స్నేహం అని, ఆలా ఆన్సర్ ఇవ్వగానే దాన్ని ఆల్రెడీ తీసాం అని ఇంకో జవాబు
అంటే సినిమాగా హిందీ లో ఆల్రెడీ తీసేసారు అంటూ పలు పలు విధాలుగా
తియ్యనైన విషయం ఏది అన్న మాటని బహు విధాలుగా నవరసాలతో చమత్కరించి
దాటేసిన రేవు ; గడిచిపోయిన కష్టాలు బహు తీపి అని ఒక అభిప్రాయాన్ని వెలుబుస్తారు
ఈ మాట ప్రకారంగానే పడిన కష్టాలలో నే ఇష్టాలు వెతుక్కున్న జీవితం నాది
కష్టాలు అంటే సినిమా కష్టాలు మాత్రం కావు
చెప్పాలంటే ఒక విధమైన ప్రివిలెజ్డ్ జీవితమే మొదటి ముప్పై ఏళ్ళు
ఒక టిపికల్ మిడిల్ క్లాస్ జీవితం బాధ్యత గల తల్లితండ్రులు మేము మొత్తం ముగ్గురం – ఒక అక్క ఒక తమ్ముడు మధ్యలో నేను – అందరం చదువులు బాగానే చదివి అక్క డాక్టర్ – మేమిద్దరం ఇంజినీర్లం అంతా బాగానే ఉండేది
నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం వలన ఫామిలీ మొత్తంలో మొదటి విదేశ యాని ఒక
నాలుగు ఏళ్ళు లండన్ మరియి అమెరికాలలో తాత్కాలిక వర్క్ పర్మిట్ లతో
కానీ నా పెళ్లి అయ్యిన రెండు ఏళ్లలోనే అమ్మకి కలిగిన తీవ్ర మోకాటి నొప్పులతో కలిగిన ఆరోగ్య సమస్య, ఆ తరువాత మోకాళ్ల ఆపరేషన్ అది అప్పటికి సక్సెస్ అయినప్పటికీ కొన్ని నెలల కు అమ్మ / నాన్నగారు విడిగా వైజాగ్ లో వుంటున్నప్పడు అమ్మ ఇంట్లో జారి కాలు విరగడం, ఆ తర్వాత ఆమె అతి కష్టం మీద నడుస్తూ ఉండడం, ఇంక ఇలా కాదని అందరమూ కలిస్తే ఉందాం అని అమ్మ / నాన్నగారు ఇరువురు నా ఇమ్మీడియేట్ కుటంబంతోనే కలిసి ఉందాం అని హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోవడం, aggressive arthritis ఇంకా ఇంకా వృద్ధి చెంది క్రమ క్రమంగా అమ్మ ఎక్కువగా వీల్ చైర్ లోనే శేషజీవితం గడపాల్సి రావడం)
ఈ ప్రహసనం ఫామిలీ మొత్తం సమగ్రంగా ఎదుర్కొనే కష్టం అది చాలా కాలం సాగడం వలన క్రమ క్రమంగా మా ఫామిలీ రకరకాలుగా రూపాతరం చెందింది అని చెప్పాలి
అందులో ముఖ్యమైనది నేను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు మానేజ్మెంట్ ట్రాక్ లని వీడి ట్రైనింగ్ వైపు పయనించడం (లైఫ్ బాలన్స్ కోసం అని నా భావన)
దాన్నించి ఇంకోళ్ళకి పాఠాలు (సాఫ్ట్ స్కిల్స్) నేర్పే బాటలో పాట్లు పొరపాట్లు దాన్నించి కొత్త పాఠాలు అది ఒక ప్రహసనం నించి ఇంకో ప్రహసహనం వైపు వెడుతూ గడుపుతున్న జీవితం (Transitions)
ఒక కార్పొరేట్ జాబ్ వదలాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత కొంచం కష్టాలు పెరిగాయి – సామర్ధ్యం కూడా పెరిగింది కానీ కావాల్సిన మేరకు ఇంకా పెంచుకొనే కష్టం మరియు దాంతో మిళితమైన ఇష్టం లో ప్రస్తుతం నేను
అమ్మ 2010 లోనే భౌతికంగా వెళ్ళిపోయుంది కానీ నాన్నగారి సాంగత్యం మాత్రం Jan 2025 వరకు ఒకే చూరు క్రింద కొనసాగడం ఒక విధంగా నా అదృష్టం.
ఆయన పాతిక ఏళ్ళ రిటైర్డ్ లైఫ్ లో సింహభాగం ఒకేచూరు క్రింద కలిసి ఉండడం – ఇది వేరే లెవెల్ కి చెందిన ప్రివిలేజ్ తరచి చూస్తే
ఆయన పదాల్లో పదనిసలు / పెడసరాలు / పద నషాలు అధ్యయనం చేసే అవకాశం కాస్త సావధానంగా లభించడం, వాటిలో అన్యాపదేశం గా వున్న సందేశాల్ని వడిసిపట్టడం నాకు వ్యక్తిగతంగా లభించడం, ఆయనకు వివరించి చెప్పే అలవాటు లేదు (తరచి తరచి అడిగితే కానీ), నాది కాస్త మట్టి బుర్ర కాబట్టి నేను వెంఠనే ఆకళింపు చేసేసుకునే ప్రతిభ అంతంత మాత్రమే కాబట్టి విషయాన్ని క్రమ క్రమంగా వివరించే ప్రయత్నం చేసే రాత మాధ్యమం ఎన్నుకోవడం, దాన్ని అప్పుడడప్పుడు పునఃసమీక్ష చేసుకోవడం – ఇదంతా చాలా కాలం నడిచిన ప్రహసనం.
వెరసి ఆయన వలన గ్రహించిన wisdom లెసన్స్ వాటిని Will, Skill & Chill (Clues for overcoming your “Transition” Blues) గా మలచడం జరిగాయి ( first time in Sept 2019)
కరోనా సమయంలో మళ్ళీ దాదాపు రెండేళ్ల పాటు నిర్వహించిన మధ్యంతర పాలేరు (mid rung మానేజ్మెంట్ రోల్ in a mid level org) జీవితం కూడా చెట్టు ఎక్కింది
కావున గత రెండేళ్ల సమయంలో నేను ఈ మధ్య కాలంలో ఎక్కవగా వినవస్తూ వున్న SAD అంటే స్ట్రెస్ / ఆంక్సిఏటీ / డిప్రెషన్ అన్న విషయాలపై కాస్త అవగాహన పెంచుకుని CBT (కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ) అన్న విషయంలో కౌన్సిలింగ్ సర్టిఫికెట్ ని తీసుకుని నా లైఫ్ కోచింగ్ అన్న విషయంతో పాటు అవసరమైనప్పుడు కౌన్సిలింగ్ చేయడం అన్న విషయం లో అధ్యయనం మరియు ఆచరణ (ప్రాక్టీస్) పెంచుకుంటూ సాగుతున్నా
దాదాపు 6 ఏళ్ళ తర్వాత ఈ పుస్తకాన్ని (Will, Skill & Chill – Clues for overcoming your “Transition” Blues) మరి కొంత కంటెంట్ మరియు ఇంకో టాగ్ లైన్ (In a Post Covid and AI-first world) జోడించి విడుదల చేయడం జరిగింది.
The mentioned is Both Amazon & Flipkart listed – check with my full name (Jagan Mantha – if interested)
I stepped into real world after my scholastic days of university and entered into an age old social institution- Marriage.
My 21st Birthday fell after a few days of my marriage.
On the day of my marriage a diaster unfolded.
My father fell sick after Nikah and I was confined to hospital for 20 days,thus leaving the bride with her parents. This was an additional blow to me as I was undergoing immense stress about the marriage.
However, the life’s rhythm picked up and we newly weds started our life with a not so ideal start experiencing typical lower middle class issues involving arranged marriages.
The need of the day for me was to find a job.
One day, while I was travelling on a train to Rajahmundry,a college junior informed me that his father who was personnel manager at ILTD( ITC subsidiary) Rajahmundry, mentioned about recruitment for seasonal clerks. The job will be for 4 months every year.
Next day I gave my application to him and after a week I attended a written test along with 50+ candidates. In the evening the results were declared and I stood first in the test. I was offered the temporary job from next day at a princely sum of Rs 250 per month. As the tobacco season yet to start, they gave a table and chair and assigned no work till season started. I used to read Alistair Mclean novels during those first three weeks. The season started after 3 weeks, and four more candidates joined. I worked for 4 months and at the end of the season the Factory head called me and appreciated my work and informed that every year I can come for the same job without any formal request.
That was my first job.
We were residing in railway quarters in a small village as my father was a railway station master, where one cannot get english newspaper. The family circumstances killed my aspiration of JNU&UPSC. I resigned to the fact and started to apply for other jobs.
Meanwhile, I applied for a clerical position in Bank of Maharashtra and I opted Nagpur centre for written test. With difficulty, I borrowed some money from a friend and my father supplemented some more funds and I attended the written test at Nagpur and returned home.
After 2 moths, the interview was again held at Nagpur . I did well at the interview. After another 3 weeks, I was offered the job and was asked to report to their Pune head office for 1 month training. During the training, I did exceedingly well, resulting an immediate posting to a nearby Branch to my place of living. I reported for my first regular job in March 1976 at Kakinada branch- After 18 months of marriage.
Those days it was an achievement for a person with a son and living with parents and siblings to get a Bank job on his own. I took a decision of shifting my family to Kakinada Town and rented a small portion of one room kitchen. With an independent streak, we started our life at Kakinada . The household chores were a challenge for both of us with a small kid to look after.
Life was falling into a routine, then a new twist came to the fore.
I was asked to attend a written test for Dist Savings officer -GOI -Min Of finance -This call letter came from “Employment exchange for post graduates”(In those days there was a special employment exchange for Post graduates. It was housed in an old building , opposite St.Ann’s school. Masab Tank) and the test was at Hyderabad. It was 1976 June.
Many well wishers suggested not to leave clerical job of a PSB but
I have decided to attend the test just because the pay was Rs 100 extra than the bank clerical job.
ఈ మధ్యన నాకు నా అంతరాత్మకి చిన్ని చిన్ని ఘర్షణలు తరుచుగా జరుగుతూండడంతో నాకు విసుగొచ్చి దానికి కటీఫ్ చెప్పేసా. అప్పటినించీ మా ఇద్దరికీ మధ్య మాటల్లేవు. ఇప్పుడు ప్రాణం హాయిగా, ప్రశాంతంగా ఉంది.
ఇంతకీ గొడవలెందుకంటారా? వస్తున్నా అక్కడికే.
అది తెలుసుకోవాలంటే అధమపక్షం ఓ మూడు, నాలుగు దశాబ్దాలు వెనక్కి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోవాలి. పదండి మరిహ అలీసం దేనికి? అక్కడే ఉంచేస్తానని భయపడకండి. ఇలా వెళ్లి అలా వచ్చేద్దాం. ఆబ్బె అది కాదు. అలా వెళ్లి ఇలా వచ్చేద్దాం.
అవి నేను బ్రహ్మచారిగా ఎంచక్కా చిన్ని ఉద్యోగం చేసుకుంటూ హాయిగా కాలం గడిపేస్తున్న రోజులు. ఏంటో గురూ ఆ రోజులే వేరు.
సరే రోజూ బైటికి వెళ్తున్నప్పుడు ఈ అంతరాత్మ నేను కూడా వస్తానని ఓ తెగ గొడవ చేసేది. సర్లే ఇంట్లో ఒక్కర్తికి భయమేమో నాక్కూడా కాస్త కంపెనీ ఇచ్చినట్టు ఉంటుందని దాన్ని వెనకేసుకుని అంటే సంకనెత్తుకుని ఊరంతా బలాదూర్ తిరిగేవాడిని. అప్పుడు మార్కెటింగ్ ఉద్యోగం వెలగపెట్టాను లెండి.
అలా తిరిగినప్పుడు ఇదిగో ఈ అంతరాత్మ ఉందే నా మానాన్న నన్ను ఉండనిచ్చేది కాదు. రోజంతా ఒకటే నస. చెవిలో జోరీగలా!
“ఏమిటీ ఆ అమ్మాయివైపు అంత సేపు చూస్తున్నావు” – పెళ్లికాని ప్రసాదు అమ్మాయిల వేపు చూడక ఆంటీ లని చూస్తాడా దాని పిచ్చి కానీ. ఏమిటీ. ఈ మధ్య రాత్రి రోజూ పాను వేసుకుంటున్నావు?! అరే. పాన్పు సుఖం లేదు కనీసం పాను సుఖం కూడ దూరం చేసుకోవాలా? “ఈ మజ్జెన సిగరెట్లు ఎక్కువ కాలుస్తున్నావు” – చస్తున్నాను దీంతో. ఓ పక్కన సేల్స్ ఎందుకు అవ్వటం లేదని రోజూ బాస్ తలంటు పోస్తున్నాడు. ఎలా ఎక్కువ అమ్మాలో తెలీక, బాస్ చెప్పక, వాడికి సమాధానం చెప్పలేక, ఇంకో బోడి ఉజ్జోగం దొరక్క టెన్షన్ తో ఓ నాలుగు సిగరెట్లు ఎక్కువ కాలిస్తే అర్ధం చేసుకోవడం పోయి ఈ ఇంటరాగేషన్ ఏమిటి?
“అసయ్యంగా ఆ బీడీలు కాల్చడం ఏమిటి” – దానికేం తెలుసు గొర్రెతోక బెత్తెడని చిరుద్యోగి జీతం ఇరవయ్యో తారీఖు కల్లా శివార్పణమ్ అని అప్పటిదాకా దర్జాగా గోల్డ్ ఫ్లేక్ సిగరెట్టేలు కాల్చినా చివరి వారంలో బీడీలతోనే సరిపెట్టుకోవాలని!
“నీకొచ్చే తొక్కలో జీతానికి నువ్వు ప్రతి ఆదివారం రెండు సినిమాలు చూడాలా?” – మా జీతానికి మా బ్రతుక్కి మందా మాకా? కనీసం సినిమాలు చూసే కనీస అదృష్టం కూడా లేదన్న మాట ఈ ఎదవ జీవితానికి
ఇలా దానికి అక్కరలేని విషయం లేదు. ప్రతి దాంట్లో వేలెట్టడమే… కాదు కాదు పుల్లలు పెట్టడమే.
అనకూడదు కానీ మనలో మన మాట పెళ్లయ్యాక నా బ్రతుకు ఎలా ఉంటుందో 70 mm సినిమాస్కోప్ లో నాకు ట్రైలర్ చూపించేసింది. ఇహ దీంతో ఇలా లాభం లేదని పెళ్లయ్యాక దాన్ని ఇంట్లోనే వదిలేసి బైటికి పోతున్నాను ఇన్ని సంవత్సరాలుగా
కానీ మీకు తెలీనిది ఏముంది సాయంత్రం ఆఫీస్ నించి ఇంటికి రాగానే మళ్ళీ ఇంటరాగేషన్ మొదలు. “ఏమిటి ఇంతాలీసం అయ్యిందివాళ” – అరే చిన్న కంపెనీల్లో పెద్ద ఉద్యోగం వెలగ పెడుతున్నప్పుడు రోజూ కొత్తగా పెళ్లయిన వాడిలా ఏడింటికల్లా ఇంట్లో వాలాలంటే ఎలా – అవతల బోల్డు పనులు, కధలు, కమామీషులు.
“ఈ మజ్జెన ఆదివారం ఇంటి పట్టునుండకుండా ఆ వెధవాఫీసు పట్టుకు వెళ్లాడకపోతే ఇంట్లో పెళ్ళాం పిల్లలతో గడపచ్చుగా ” – నేను ఇంటికంటే ఆఫీస్ పదిలం అని వెళ్తున్నానని ఎప్పటికి అర్ధం చేసుకుంటుందో ఏమిటో
“ఈ మధ్య పార్టీలు ఎక్కువయ్యాయి నీకు. ఛాన్స్ దొరికితే చాలు ఏదో వంకతో పార్టీ అని జంప్ అయ్యిపోతావు” – అమ్మా తల్లీ నీకేం తెలుసు మగాళ్ల సోషల్ రెస్పాన్సిబిలిటీస్. ఆఫీసన్నాకా బోల్డు మంది సహోద్యోగులుంటారా? నలభై ఏళ్లుగా హైదరాబాద్ లో పడుంటే బోల్డు మంది ఫ్రెండ్స్ కూడా ఉంటారుగా?
మరి ఒకడికి కొత్త ఉద్యోగం వస్తుంది. పార్టీ.
ఇంకోడి కొడుక్కి ఎంసెట్ లో మంచి రాంక్ వచ్చింది. పార్టీ.
ఇంకోడు ఇల్లు బుక్ చేసాడు. పార్టీ. దాని గృహప్రవేశం అయ్యాక పార్టీ.
ఇంకోడి కూతురికి పెళ్లి కుదిరింది. పార్టీ. ఎంగేజ్మెంట్ పార్టీ. పెళ్లయ్యాక రిసెప్షన్ పార్టీ. నాలుగు రోజులయ్యాక ఆప్త మిత్రులందరికీ సినిమా వాళ్ళు సక్సెస్ మీట్ చేసుకున్నట్టు పార్టీ.
ఇంకోడు కొత్త కారు కొంటాడు. పార్టీ.
ఇంకోడి కొడుక్కి అమెరికా వీసా వచ్చింది. పార్టీ.
ఆఫీసులో ఒకడికి ప్రమోషన్. పార్టీ.
ఇలా పార్టీ పార్టీ పార్టీ. ఏది అటెండ్ అవ్వకపోతే వాడికే కోపం. అటెండ్ అయితే అంతరాత్మకి, దాంతో పాటు ఆవిడ గారికి కోపం. మీరెన్ని చెప్పండి. మన దేశంలో మగాడి పరిస్థితి బహు అధ్వానం.
ఈ ఈతి బాధలు పోలీసోడి దెబ్బల్లాంటివి. చెప్పుకోలేం. చూపించుకోలేం. పడ్డ వాడికే తెలుస్తుంది నొప్పి
ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ సమాప్తం
ఈ అంతరాత్మలు సామాన్య మానవుడినే కాదు సినిమాల్లో హీరోలని కూడా విసిగించేవి పాత సినిమాల్లో! పాపం హీరో ఏదో విషమ పరిస్థితుల్లో ప్రియురాలికి టాటా చెప్పేసి ఇంకో సుందరిని పెళ్లి చేసుకుందామనుకున్నాడనుకోండి.
ఆ వదిలేసిన ప్రియురాలు “ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుతున్నా” అని క్షమిస్తుందేమో కానీ ఈ అంతరాత్మ ఛస్తే క్షమించదు. వదలదు. పీక్కు తింటుంది వాడ్ని.
ఇలా పీక్కు తినడాన్ని ఆ నాడు దర్శకులు చాలా బాగా చూపించేవాళ్ళు.
హీరో పెద్ద నిలువుటద్దం ముందు నిలపడి ఉంటాడు. అద్దంలో అంతరాత్మ. ఇద్దరికీ వేర్వేరు బట్టలేసేవాళ్ళు లేపోతే మనం కన్ఫ్యూషన్ అవుతామని. ఇహ చూస్కోండి వాళ్లిద్దరూ ఓ తెగ డిషుమ్! డిషుమ్! ! సివరాకరికి హీరోకి ఒళ్ళు మండిపోయి పక్కనే ఉన్న ఓ పెద్ద ఫ్లవర్ వాజ్ ని ఆ అద్దం మీదకి మాంఛి కోపంతో విసిరేస్తాడు. దాంతో అద్దం ముక్కలు ముక్కలు అయ్యి గదినిండా పడిపోతుంది.
అక్కడితో అవ్వలేదండోయ్. ఆ ప్రతి అద్దం ముక్కలో ఈ అంతరాత్మ మొహం భీకరంగా పెట్టి వికటాట్టహాసం చేస్తూంటుంది. హీరో కి ఇంకేం చెయ్యాలో తెలీక అంటే ఆ ముక్కలని తన చెయ్యి కోసుకు పోకుండా ఇంకా చిన్న చిన్న ముక్కలు ఎలా చేయాలో తెలీక, ఒహ వేళ తెలిసినా అలా చేస్తే ఇప్పుడు ఓ డజను ముక్కల్లో ఉన్న అంతరాత్మ ఇంకో రెండు డజను ముక్కల్లో కనిపిస్తుందన్న విషయం అర్ధమయ్యి ఆ గదిలోంచి విసురుగా బైటికి వెళ్ళిపోతాడు.
ఇప్పుడు ఇప్పడికి వస్తే ఎందుకు నాకు నా అంతరాత్మకీ గొడవలయ్యాయంటే ఇన్నాళ్లు ఉద్యోగం, సద్యోగం పుణ్యమా అని అధమ పక్షం వారంలో ఆరు రోజులు బైటికి పోయేవాడిని. ఈ కొరోనా పాపమా అని నేను మూడు నెలలుగా ఇంటిపట్టునే పడుండడంతో వచ్చింది చిక్కంతా!
గత మూడు దశాబ్దాల పై చిలుకు నేను బైట, అంతరాత్మ లోపల (ఇక్కడో పన్ ఏడిసింది) ఉండేవాళ్ళం. ఇప్పుడో పొద్దున్న లేచిందగ్గరినించీ ఇద్దరం మొహామొహాలు చూసుకోవడం. అలవాటు లేని పనాయె. దాంతో ఇద్దరికీ చెప్పలేని చిరాకొచ్చి రోజూ చీటికీ మాటికీ కీచులాటలు. మాట మాట అనుకోవడం మొహం ముడుచుకోవడం .
మీరు కూడా అలా ఓ నదరుగా ఉన్న ఓ అద్దం పగలకొట్టేయచ్చుగా అంటారేమో. ఎంత కోపం వచ్చినా కాస్త వెనకా ముందు చూసుకుని రెచ్చిపోయే టైపు నేను., అలా అద్దం పగలకొడితే మళ్ళీ నాకే పడుతుంది దాని బడ్జెట్. ఎవరి మీదన్నా కోపమొస్తే చేతిలో ఉంది కదా అని నలభై వేలు పోసి కొన్న వన్ ప్లస్ 7 విస్సిరి కొడతామా ఏమిటి? మహా అయితే దగ్గర్లో ఏదన్నా న్యూస్పేపర్ లేదా మ్యాగజైన్ ఉంటె దాన్ని విసురుతాం. ఎంతైనా బతక నేర్చిన బడ్జెట్ పద్మనాభాలం కదా
అయినా మనసు కవి ఆత్రేయ గారు ఎప్పుడో చెప్పారు “మనసున్న మనసుకి సుఖము లేదంతే” అని. ఈ మనసు, అంతరాత్మ వేర్వేరని నా అంతరాత్మ ఛీ ఛీ ఛీ నేను చెప్తున్నా.
సరే మళ్ళీ అసలు కధలోకొస్తే దాని బాధ ఇలా రోజూ పడడం నావల్ల కాక మొన్నా మధ్య కటీఫ్ చెప్పేశా. అప్పటినించీ ప్రాణం హాయిగా. జీవితం ప్రశాంతంగా!
అదీ మా ఆవిడా చెవులు కొరుక్కుంటూంటారు నా గురించి. నాకేం భయమా?
జంట ఎద్దుల అరకగట్టీ ఎద్దువోలే ఒల్లరగదీసీ నెత్తురోడ్సీ సెమట గార్సీ రేయిపొగులూ నేలతల్లికి దీటుగానూ *పొగులుకుంటా (1) ఎండవానల దుక్కిదున్నీ కొద్దిగైనా గింజ పండితే పట్టెడంతా కూటి కొరకై పుట్ల పంట దళారికమ్మితే చేతికందిన ఒక్క డబ్బూ జేబు దంకా చేర్చబోతే జాలి చూపక అప్పులయ్య ఒడిసిపుచ్చుకు ఎల్లిపోతే ఇంటిల బుడ్డోడి ఆకలి ఆసగా నిన్నెదుకుతుంటే ఎండుపానం నీదు పెండ్లము కన్నీరె సన్నుగ గుడుపుతుంటే కండ్ల ఎదటన చేను తల్లి సుక్క నీటికి అలమటిస్తే కుప్ప నూర్సిన కొత్త ధాన్యం వరద తాకి బురదలైతే జోరు వానకి *కొట్టమెల్లా (2) కుప్పకూలీ *తొక్కటైతే (3) తాలలేకా గొడ్డు గోదా ఊపిరొదిలే *కాయిలైతే (4) తాత తండ్రుల ఒక్క సెక్కా కబ్జదారుడు నూకుతుంటే సాయమడిగితె నేతలంతా ఓట్లునొక్కీ మాయమైతే నాయమిచ్చే కోరట్ల జడ్డిలు కుంబకర్నుని నిదరలైతే అడగబోతే లాటీల కొడుకులు సదునుగా ఒల్లిరగదీస్తే *బొంకులమ్మే వార్తవదినెలు (5) వెతల కతలను అమ్ముతుంటే పడ్డ కస్టము పాడెగట్టుక పొలములోనే హరీమంటే ఆస కరవై బతుకు బరువై *ఒలికిమిట్టే నెలకువైతే (6) ఏడ జూసిన యాడె జీవుడు నెర్రెలిచ్చిన నేల అయితే గడసిపోయిన నిన్న *కల్లై (7) ఎదురూ చూసే రేపు కలయై ఉన్న నిజమీ ఒక్క దినమూ వొల్లకాడుల సిందులైతే కడుపు నించని గొడ్డుశాకిరి *కొడిగట్టు దీపపు *యాతనైతే (8, 9) దినము రేతిరి ఒక్క తీరుగ *మనికి మంటల కొలిమిలైతే (10) నిన్ను తలుసుకు నీలో *నివ్వే (11) *యాసిరై సీ గొట్టుకుంటే (12) *ఉడ్డుకుడుసుకుపోయి జీవము (13) *సాయనీకే *ఎదుకాడుతుంటే (14, 15) ఎంత కష్టం ఎంత కష్టం ||
చెమటలోడ్చుకు రక్తమార్చుకు నాకు నీకూ కంచాలు నింపీ పట్టెడన్నం కంట చూడని సేద్యగాడికి ఏది లాభం రైతు డొక్కకి ఏది అన్నం కడుపు నింపే ధరణి పుత్రా ఎవరు నీకిక దన్ను ధైర్యం ఎంత కష్టం ఎంత కష్టం ||